Telugu News » KTR : మూడు గంటలా? మూడు పంటలా? మీదే నిర్ణయం!

KTR : మూడు గంటలా? మూడు పంటలా? మీదే నిర్ణయం!

కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు కరెంట్‌ ఇవ్వలేదని స్వయంగా రేవంత్‌ రెడ్డే చెప్పారని గుర్తు చేశారు కేటీఆర్.

by admin
Minister KTR Speech At BRS Public Meeting At Yellareddy

రాష్ట్రంలో విద్యుత్‌ కోసం బతిమాలుకున్న రోజులు మర్చిపోదామా? అని ప్రజలను అడిగారు మంత్రి కేటీఆర్ (KTR). సోమవారం కామారెడ్డి (Kamareddy) జిల్లాలో ఆయన పర్యటించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి (Prashanth Reddy) తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కామారెడ్డిలో నర్సన్నపల్లి వద్ద స్వాగత తోరణం, సెంట్రల్‌ లైటింగ్‌, సెంట్రల్‌ మీడియన్‌ ను ప్రారంభించారు. అలాగే, ఎల్లారెడ్డిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి కోసం రూ.45 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు.

Minister KTR Speech At BRS Public Meeting At Yellareddy

ఎల్లారెడ్డి నియోజ‌క‌వ‌ర్గం మొత్తం అభివృద్ధి ప‌థంలో దూసుకుపోతోందని అన్నారు కేటీఆర్. కేసీఆర్‌ (KCR) ను, మంత్రుల‌ను సురేంద‌ర్ (Surender) ఎప్పుడు క‌లిసినా తమ నియోజ‌క‌వ‌ర్గం వెనుక‌బ‌డింది.. నిధులు కేటాయించాల‌ని అడుగుతారని తెలిపారు. నియోజ‌క‌వ‌ర్గంలో రోడ్ల అభివృద్ధి కోసం రూ.20 కోట్ల 31ల‌క్ష‌ల నిధులు మంజూరు చేస్తున్నామ‌ని ఈ ఒక్క నియోజ‌క‌వ‌ర్గంలోనే 1,03,348 మంది రైతుల‌కు రైతుబంధు అందుతున్న‌దని పేర్కొన్నారు. 2001 నుంచి కేసీఆర్‌ కు ఓ త‌మ్ముడిలా స్థానిక ఎమ్మెల్యే సురేంద‌ర్ 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో వెన్నంటి న‌డిచార‌ని అన్నారు.

ఇక కాంగ్రెస్ పై విరుచుకుపడిన కేటీఆర్.. రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు కరెంట్‌ ఇవ్వలేదని స్వయంగా రేవంత్‌ రెడ్డే చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రంలో విద్యుత్‌ కోసం బతిమాలుకున్న రోజులు మర్చిపోదామా? అని అడిగారు. ఏ పార్టీ అయినా కరెంట్‌ విషయంలో ఆలోచించాలని కోరారు. రాష్ట్రంలో రైతులకు మూడు గంటలే విద్యుత్‌ సరిపోతుందని రేవంత్‌ రెడ్డి అన్న వ్యాఖ్యలను వివరిస్తూ ఫైరయ్యారు. మూడు గంటలే కావాలా.. మూడు పంటలు కావాలో ప్రజలే తేల్చుకోవాలని అన్నారు.

‘‘కేసీఆర్‌ కు మ‌నీ ప‌వ‌ర్ లేదు. మ‌జిల్ ప‌వ‌ర్ లేదు. మీడియా బ‌లం లేదు. ఇత‌ర హంగులు లేవు. సినిమా యాక్ట‌ర్ కాదు. డ‌బ్బు లేదు. ఆయ‌న ఎత్తుకున్న అంశంలో కేవ‌లం నిజాయితీ మాత్ర‌మే ఉంది. ఆయ‌న మాట‌ల్లో నిప్పులు ఉన్నాయి. కాబ‌ట్టే ఆనాడు తెలంగాణ మొత్తం అగ్గిలా మండింది. రాష్ట్రం ఏర్ప‌డింది’’ అని తెలిపారు కేటీఆర్.

You may also like

Leave a Comment