Telugu News » Adilabad Congress : భర్తకు చేయందించిన కాంగ్రెస్, భార్యకు ‘హ్యాండిస్తుందా’?

Adilabad Congress : భర్తకు చేయందించిన కాంగ్రెస్, భార్యకు ‘హ్యాండిస్తుందా’?

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ అసెంబ్లీ, ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలపై కన్నేసిన ఎమ్మేల్యే రేఖానాయక్ దంపతులు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. వీరిద్దరిలో భర్త శ్యాం నాయక్ ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు.

by Prasanna
Rekha nayak and husband

తెలంగాణా (Telanagana) లో ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ టిక్కెట్లను సైతం ప్రకటించింది. బీఆర్ఎస్ (BRS) టిక్కెట్లు ఆశించి భంగపడిన వారంతా ఎన్నికల బరిలో దిగేందుకు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. వారిలో సరైన అభ్యర్థులును ఎంపిక చేసుకుని వారిని తమ వైపు లాక్కునే ప్రయత్నాలను కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటికే ప్రారంభించాయి. ఇందులో కాంగ్రెస్ కాస్త ముందంజలో ఉంది. అయితే ఆదిలాబాద్ జిల్లాలోని నిజయోకవర్గాల టిక్కెట్ల విషయంలో కాంగ్రెస్ (Congress) కు పోటీ ఎక్కువైంది.

Rekha nayak and husband

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ అసెంబ్లీ, ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలపై కన్నేసిన ఎమ్మేల్యే రేఖానాయక్ దంపతులు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. వీరిద్దరిలో భర్త శ్యాం నాయక్ ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మేల్యేగా ఉన్న రేఖా నాయక్ కు కేసీఆర్ ప్రకటించిన లిస్ట్ లో సీటు దక్కలేదు. దీంతో ఆమె పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. రేఖా నాయక్, ఆమె భర్త శ్యాం నాయక్ ఖానాపూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల టికెట్లు ఆశిస్తున్నారు.

రేఖా నాయక్ బీఆర్ఎస్ పార్టీకి బై చెప్పేందుకు సిద్దమవ్వడంతో ఆమెను కాంగ్రెస్ తమ పార్టీలోకి ఆహ్వానించింది. ఆర్టీవోగా పని చేస్తున్న ఆమె భర్త శ్యాం నాయక్ కూడా ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. దీంతో భార్య, భర్తలద్దరికి వారు ఆశిస్తున్న సీట్లు కాంగ్రెస్ పార్టీ తరపున ఖరారైనట్లు, రానున్న ఎన్నికల్లో వారే ఆ నియోజకవర్గాల అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

రేఖా నాయక్, శ్యాం నాయక్ కూడా ఇదే ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పటికే టిఆర్ఎస్ ఎమ్మెల్యే లు మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే వీరేశం కాంగ్రెస్ గూటికి చేరగా, ఎమ్మెల్యే రేఖా నాయక్ సైతం అధికారికంగా కాంగ్రెస్ లో చేరేందుకు అంతా సెట్ చేసుకున్నారు. నేడో, రేపో ఆమె కాంగ్రెస్ లో చేరుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి వస్తున్న సమాచారం. కాంగ్రెస్ పెద్దలతో ఆమె టచ్ లో ఉన్నా ఇంకా ఆమెకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి లైన్ క్లియర్ కాలేదని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే గోండు సామాజిక వర్గానికి ఆదిలాబాదులో టికెట్లు కేటాయించాలని ఆ వర్గం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎస్టీ రిజర్వుడ్ గా ఉన్న ఖానాపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గం లో తొలి నుంచి ఆ వర్గానికి సంబంధించిన నాయకులు పార్టీలో పనిచేస్తున్నారు. వారికి కాదని ఆదిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

దీనితో పాటు ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఓవైపు కాంగ్రెస్ పెద్దలు తొలి జాబితా వచ్చేనెల మొదటి వారంలో విడుదల చేయనున్నట్టు తెలపడంతో ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. కేంద్రంలో మహిళా బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా రాష్ట్రంలోనూ మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో కొన్ని బలమైన స్థానాలకు మహిళలకు కేటాయించాలని కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అదిలాబాద్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో బలమైన మహిళ నేతల కోసం కాంగ్రెస్ అధిష్టానం జల్లెడ పడుతోంది.

You may also like

Leave a Comment