పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ని టార్గెట్ చేయడంలో ముందుంటారు మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu). కాపు నాయకుడు కావడంతో జగన్ (Jagan) కూడా ఈయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. అయితే.. ‘బ్రో’ సినిమాలో అచ్చం రాంబాబులా డ్యాన్స్ చేస్తున్న శ్యాంబాబు (Syambabu) క్యారెక్టర్ ని క్రియేట్ చేశారు. ఆ తర్వాత ఇదేంటి ‘బ్రో’ అంటూ అంబటి కూడా ఎటాక్ లో వేగం పెంచారు. తాను కూడా కొన్న సినిమాలు తీస్తానంటూ టైటిల్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం చంద్రబాబు అరెస్ట్ చుట్టూ మాటల యుద్ధం కొనసాగుతుండగా పవన్ ను టార్గెట్ చేశారు రాంబాబు.
చంద్రబాబు (Chandrababu) అరెస్ట్ ను ఏపీలోని ప్రతిపక్ష నేతలు ఖండించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు జగన్ పాల్పడుతున్నారని విమర్శించారు. పవన్ కూడా తనదైన రీతిలో విమర్శలు చేశారు. ఇదే సమయంలో ఆయన హైదరాబాద్ నుంచి మంగళగిరిలోని జనసేన (Janasena) పార్టీ ఆఫీస్ కు వెళ్లేందుకు బయలుదేరగా.. పోలీసులు అడ్డుకున్నారు. ముందుగా ఎయిర్ పోర్టు అధికారులతో సంప్రదింపులు జరిపి రాకుండా చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ (Pawan) వస్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పారు. అయితే.. జనసేనాని రోడ్డు మార్గంలో మంగళగిరి బయలుదేరి వారికి షాకిచ్చారు.
మంగళగిరిలోని పార్టీ ఆఫీస్ కు వెళ్తున్న పవన్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నడిరోడ్డుపైనే ఆయన పడుకుని నిరసన తెలిపారు. ఏపీకి వెళ్లాలంటే వీసా తీసుకోవాలా? అంటూ ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ కాగా.. అంబటి సంప్రదించారు. అవినీతి బాబుని అరెస్ట్ చేస్తే నీకు ఇదేమి కర్మ ‘బ్రో’ అని వ్యంగ్యంగా కామెంట్ చేశారు. దీనిపై జనసైనికులు కౌంటర్ ఎటాక్ కొనసాగిస్తున్నారు.
జనసేన పీఏసీ సమావేశం కోసం వెళ్తున్న పవన్ ను అడ్డుకుని.. చంద్రబాబు ఇష్యూకి ముడిపెట్టి వైసీపీ నేతలు రాక్షస ఆనందం పొందుతోందని అంటున్నారు జనసేన నేతలు, కార్యకర్తలు. పీఏసీ మీటింగ్ ఎప్పుడో నిర్ణయించుకున్నామని.. దానికోసం పవన్ వస్తుంటే చంద్రబాబు కోసం వస్తున్నారని దుష్ప్రచారం చేయడం వైసీపీ వక్రబుద్ధిని నిదర్శనమని కామెంట్ చేస్తున్నారు.