Telugu News » Amit Shah : కేసీఆర్ జైలుకు పక్కా..!

Amit Shah : కేసీఆర్ జైలుకు పక్కా..!

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, బీఆర్ఎస్ పరిపాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి.. కేసీఆర్ ను జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు.

by admin
Amit Shah Public Meeting at Armoor

– బీజేపీ గెలిస్తే బీసీ సీఎం
– బీడీ కార్మికులకు ప్రత్యేక ఆస్పత్రి
– ముస్లిం రిజర్వేషన్లు రద్దు
– నిజామాబాద్‌ లో పసుపు పరిశోధనా కేంద్రం
– కేసీఆర్ పాలన అవినీతిమయం
– ఆర్టీసీ స్థలాలను కబ్జా చేశారు
– డబ్బులిస్తేనే మంత్రి పదవులు ఇచ్చారు
– మజ్లీస్ చేతిలో బీఆర్ఎస్ స్టీరింగ్
– ఆర్మూరు సభలో అమిత్ షా ఫైర్

తెలంగాణ (Telangana) లో కుటుంబ పాలనను తరిమి కొట్టి.. బీజేపీ (BJP) కి ఓటు వేసి గెలిపించాలని కోరారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah). శుక్రవారం ఆర్మూర్‌ లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి (Rakesh Reddy) కి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ కేసీఆర్ (KCR) పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పిన ఏకైక పార్టీ బీజేపీ అని తెలిపారు. పెట్రోల్ పై కేంద్రం పన్ను తగ్గిస్తే.. కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదని మండిపడ్డారు.

Amit Shah Public Meeting at Armoor

కేసీఆర్ హయాంలో అవినీతి రాజ్యమేలుతోందన్న షా.. కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ప్రధాని మోడీ (PM Modi) పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని వివరించారు. కానీ, పదేళ్లలో తెలంగాణను బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం విధ్యంసం చేసిందని విమర్శించారు. ఆర్టీసీ స్థలాలను కూడా గులాబీ నేతలు వదలడం లేదని ఆరోపించారు.

టేబుల్‌ పై డబ్బులు పెట్టిన వాళ్లనే కేసీఆర్ మంత్రులను చేస్తున్నారని అన్నారు అమిత్ షా. ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. కేసీఆర్ సమయం అయిపోయిందని.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, బీఆర్ఎస్ పరిపాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి.. కేసీఆర్ ను జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతుల్లో ఉందన్న ఆయన.. పేపర్ లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ ఆడుకున్నారని మండిపడ్డారు.

నిజామాబాద్‌ లో బీడీ కార్మికులకు ప్రత్యేక ఆసుపత్రిని నిర్మిస్తామని.. పసుపు పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. తమకు అధికారం ఇస్తే 4 శాతం మైనార్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ ఇచ్చిన ఒక్క మాట, హామీని నెరవేర్చలేదని విమర్శలు గుప్పించారు. దళిత ముఖ్యమంత్రి అని చెప్పి మాట తప్పారన్నారు. కానీ, బీజేపీ బీసీ ముఖ్యమంత్రి హామీని నిలబెట్టుకుంటుందని స్పష్టం చేశారు. ఉత్తర తెలంగాణ నుంచి వెళ్లిన గల్ఫ్ బాధితుల కోసం ఎన్ఆర్ఐ పాలసీ ఇచ్చామని.. ఏడాదిలో నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామన్నారు. అవినీతి కేసీఆర్‌ ను గద్దె దింపాల్సిన అవసరం ఉందని తెలిపారు అమిత్ షా.

You may also like

Leave a Comment