Telugu News » Father’s Pray : నా ఆస్తి తిరిగి ఇప్పించండి మహాప్రభో…ప్రజావాణిలో ఓ వృద్ధుడి ఆవేదన..!

Father’s Pray : నా ఆస్తి తిరిగి ఇప్పించండి మహాప్రభో…ప్రజావాణిలో ఓ వృద్ధుడి ఆవేదన..!

ఓ తండ్రి గుండె మండింది. గుండెల్లో పెట్టుకుని చూసిన కొడుకుల గుండె కఠినంగా మారినందుకు కుమిలిపోతున్నాడు.

by sai krishna

ఓ తండ్రి గుండె మండింది. గుండెల్లో పెట్టుకుని చూసిన కొడుకుల గుండె కఠినంగా మారినందుకు కుమిలిపోతున్నాడు.తాను పంచిన ఆస్తి అనుభవిస్తూ తనని ముష్టివాడిగా జమకడుతున్నందుకు వాపోయాడు.

పట్టెడన్నం పెట్టడానికి వంతులేసుకుంటున్నారని ప్రజావాణిలో తనగోడు వెళ్లబోసుకున్నాడు. కన్న మమకారంతో ఇచ్చిన కోట్ల ఆస్తిని తిరిగి తనకు ఇప్పించాలని కలక్టర్ని కోరాడు.

 

వివరాల్లోకి వెళితే కరీమ్ నగర్ జిల్లా(Karim Nagar District) కలెక్టరేట్ లో జరుగుతున్న ప్రజావాణికి నోముల రాజయ్య( Nomula Rajayya)అనే ఓ వృద్థుడు తన బోధకాలిని ఈడ్చుకుంటూ అక్కడికి వచ్చాడు.

ఐదు కోట్ల రూపాయల ఆస్తి సంపాదించి..ఇస్తే తన కొడుకులు తిండి కూడా పెట్టడం లేదని కరీంగజిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. అక్కడ కలెక్టర్ తో పాటు ఇతర ఉన్నతాధికారును చూసి బోరున విలపించాడు. తన ఇద్దరు కొడుకులు తిండి పెట్టడం లేదని కన్నీరు పెట్టుకున్నాడు.

తాను రెక్కలు ముక్కలు చేసుకుని.. కష్టపడి సంపాదించిన భూమిని పంచుకున్న ఇద్దరు కొడుకులు ..ఇప్పుడు తనకు తిండి పెట్టడం లేదని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు.

ఇన్నాళ్లు చిన్న కొడుకు, కోడలు తిండిపెట్టారని, అయితే.. చిన్న కొడుకు తిండి పెడుతుంటే పెద్ద కోడలు వాళ్లను తిడుతోందని చెప్పాడు. దీంతో చిన్న కొడుకు కుటుంబం కూడా తనకు తిండిపెట్టడం లేదని వాపోయాడు.

తన నుంచి కొడుకులు పంచుకున్న భూమిని తిరిగి తన పేరు మీదకు మార్చాలని జిల్లా కలెక్టర్ కు రాజయ్య విజ్ఞప్తి చేశాడు.తన భూమిని తనకు అప్పగిస్తే చాలని, అవసరమైతే ఎవరికైనా దానం చేసుకుంటానని దండం పెట్టి వేడుకున్నాడు.

అయితే.. వృద్ధుడి ఆవేదనను విన్న జిల్లా కలెక్టర్ కొడుకులను పిలిపించి మాట్లాడుతానని రాజయ్యకు హామీ ఇచ్చారు. ఈ మధ్యే మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

తల్లిదండ్రుల పోషణ, పిల్లలకు ఆస్తుల పంపకాలపై మద్రాస్ హైకోర్టు(Madras High Court)సంచలన తీర్పు చెప్పింది. పిల్లలకు ఆస్తుల పంపకాలపై తలెత్తిన కీలక ప్రశ్నలకు సమాధానం చెప్పింది.

తమ పోషణను సరిగ్గా పట్టించుకోకుంటే పిల్లలకు కేటాయించిన ఆస్తులను వెనక్కు తీసుకునే హక్కు తల్లిదండ్రులకు ఉంటుందని ఆ తీర్పులో తేల్చి చెప్పింది. నోముల రాజయ్య నోము పండి ఆస్తి తిరిగి అతని చేతికి వస్తుందేమో చూడాలి.

You may also like

Leave a Comment