Telugu News » neglect : గాయం చిన్నదని నిర్లక్ష్యం చేస్తే.. చివరికి ప్రాణం తీసింది..!!

neglect : గాయం చిన్నదని నిర్లక్ష్యం చేస్తే.. చివరికి ప్రాణం తీసింది..!!

ఏడో తరగతి చదువుతున్న ప్రదీప్‌ (Pradeep) అనే పదకొండు సంవత్సరాల బాలుడు.. సెప్టెంబర్‌ 26న గ్రామంలో జరిగిన వినాయక శోభాయాత్రలో ఆనందంగా ఆడుతూ.. చిందులేశాడు. తన తోటి స్నేహితులతో కలిసి సరదాగా డ్యాన్స్ చేస్తున్న సమయంలో జరిగిన తోపులాటలో ప్రదీప్ కింద పడిపోయాడు..

by Venu

పిల్లలు అన్నాక ఆడుకోవడం సహజం.. కానీ పిల్లల ప్రతి చర్యను జాగ్రత్తగా గమనించడం తల్లిదండ్రుల బాధ్యత. నేటి కాలంలో మృత్యువు ప్రతి మలుపులో పొంచి ఉంటుందని తెలిసిందే. ఇక నిర్లక్ష్యం అనేది అతి భయంకరమైన రోగం వంటిదని అంటారు. దీనివల్ల నిండు ప్రాణం బలి అవడం ఎక్కడో ఒకచోట కనిపిస్తుంది. ప్రస్తుతం ఇలాంటి ఘటనే మెదక్ (Medak) జ్లిలా పెద్దేముల్‌ (Pedemul) గ్రామంలో చోటుచేసుకుంది.

ఈ గ్రామానికి చెందిన ఏడో తరగతి చదువుతున్న ప్రదీప్‌ (Pradeep) అనే పదకొండు సంవత్సరాల బాలుడు.. సెప్టెంబర్‌ 26న గ్రామంలో జరిగిన వినాయక శోభాయాత్రలో ఆనందంగా ఆడుతూ.. చిందులేశాడు. తన తోటి స్నేహితులతో కలిసి సరదాగా డ్యాన్స్ చేస్తున్న సమయంలో జరిగిన తోపులాటలో ప్రదీప్ కింద పడిపోయాడు.. ఈ క్రమంలో ఆ బాలుడికి కడుపు భాగంలో చిన్న గాయమైంది.

ఆ గాయాన్ని బాలుడి కుటుంబ సభ్యులు పెద్దగా పట్టించుకోలేదు. స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ డాక్టర్‌కు చూపించి చికిత్స చేయించారు. ఈ నిర్లక్ష్యం ఆ బాలుడి పాలిట శాపంగా మారింది. అనంతరం కొద్దిరోజుల తర్వాత ప్రదీప్ కు తరచుగా కడుపు నొప్పి రావడం మొదలైంది. ఈక్రమంలో తాండూరులోని పలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది.

బాలుడికి కడుపు నొప్పి ఎక్కువ అవడంతో ఇటీవల హైదరాబాద్‌ (Hyderabad)లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు తల్లిదండ్రులు.. అక్కడ ఆ బాలుడిని పరీక్షించిన వైద్యులు కడుపులో లివర్‌తో పాటు పలు అవయవాలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. అలా చికిత్స తీసుకుంటున్న క్రమంలో ఆ బాలుడు ఈనెల 13న రాత్రి మృతిచెందడం స్థానికుల హృదయాలను తొలిచేస్తుంది.

You may also like

Leave a Comment