Telugu News » GHMC : రెచ్చిపోయిన రోడ్ సైడ్ వ్యాపారి.. జీహెచ్ఎంసీ సిబ్బందిపై రాళ్లు, కొబ్బరి బోండాలతో దాడి!

GHMC : రెచ్చిపోయిన రోడ్ సైడ్ వ్యాపారి.. జీహెచ్ఎంసీ సిబ్బందిపై రాళ్లు, కొబ్బరి బోండాలతో దాడి!

హైదరాబాద్ మహానగరంలో అనుమతి లేకుండా చాలా మంది రోడ్ సైడ్ వ్యాపారాలు(Road side Business) నిర్వహించేవారున్నారు. వీరు రోడ్ పక్కన కాస్త ఖాళీ ప్రదేశం కనిపించిన వెంటనే అక్కడ చిన్న షెడ్ వేసుకుని దుకాణాలు తెరిచేస్తుంటారు. మరికొందరైతే ఏకంగా పాదాచారుల(Pedestrians)కోసం ఏర్పాటు చేసిన ఫుట్ పాత్ కూడా వదిలిపెట్టడం లేదు.దీంతో సామాన్యులు, పాదచారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

by Sai
Angry roadside trader attacked GHMC staff with stones and coconuts!

జీహెచ్ఎంసీ సిబ్బంది వచ్చి షాపులు తొలగించాలని చెప్పిన కొందరు వినిపించుకోవడం లేదు. ఈ మధ్యకాలంలో ఫుట్ పాత్‌ల మీద చాయ్ స్టాల్స్, పంక్ఛర్ షాప్స్ , జ్యూస్ పాయింట్స్ ఇలా అనేకం ఓపెన్ చేయడంతో ఫలితంగా బాటసారులు వావానాలు వెళ్లే రోడ్డు మీద నుంచి వెళ్లాల్సి వస్తోంది.

ఫలితంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే శనివారం తెల్లవారుజామున అనుమతి లేకుండా రోడ్ సైడ్ ఏర్పాటు చేసిన కొబ్బరి బోండాల షాపును తొలగించాలని, ఫలితంగా అక్కడ చెత్త భారీగా ఏర్పడుతోందని జీహెచ్ఎంసీ సిబ్బంది(GHMC STAFF) వ్యాపారికి సూచించారు. అతను వినకపోవడంతో వారు తొలగించే ప్రయత్నం చేయగా.. ఆ వ్యాపారి రెచ్చిపోయాడు.

అక్కడే ఉన్న ఇటుకరాళ్లు, కొబ్బరి బోండాలతో సిబ్బందిపైకి(ATTACK) విసురుతూ వారిపై దాడికి దిగాడు. దీంతో వారు అక్కడి నుంచి తప్పించుకుని వెంటేనే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌‌లోని సులేమాన్ నగర్ ప్రధాన రహదారి వద్ద చోటుచేసుకుంది. సదరు వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సమాచారం.

You may also like

Leave a Comment