Telugu News » Telangana : గుట్టుచప్పుడు కాకుండా మరో స్కాం..!!

Telangana : గుట్టుచప్పుడు కాకుండా మరో స్కాం..!!

వీఆర్ టెలీ హెల్త్ సర్వీస్ కి కోట్ల రూపాయల క్లియరెన్స్ ఇవ్వాలని ఐఎంవోలపై ఒత్తిడి పెరుగుతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన రికార్డుల మెయింటనెన్స్‌ డిస్పెన్సరీల స్థాయిలో చేయకపోవడంతో ప్రూఫ్‌ ఆఫ్‌ వర్‌ ను ఎలా సమర్పించాలో అర్థం కాక ఐఎంఓలు తల పట్టుకుంటున్నట్టు తెలుస్తోంది.

by admin
Another Scam in ESI

– ఈఎస్ఐలో మరో కుంభకోణానికి స్కెచ్!
– 100 రూపాయలకు 600 రూపాయల బిల్స్
– టెలీ మెడిసిన్‌ సేవల పేరుతో కాజేసే యత్నం
– సంబంధం లేని ఐఎంవోల సంతకాల కోసం ఒత్తిడి
– మాజీ ఎంపీ వినోద్, అధికారి భూపాల్ రెడ్డిపై అనుమానాలు?
– అచ్చం ఆంధ్రా స్కాం స్టైల్ లోనే ప్లాన్

ఆంధ్రాలో జగన్ (Jagan) ప్రభుత్వం వచ్చాక సంచలనం రేపిన కేసు ఈఎస్ఐ (ESI) స్కాం. గత టీడీపీ (TDP) ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన అచ్చెన్నాయుడు (Achemnaidu) ఈ కేసులో అరెస్ట్ కూడా అయ్యారు. ఈఎస్‌ఐ పరిధిలో లేని కంపెనీల నుంచి నకిలీ కొటేషన్లు తీసుకొచ్చి భారీగా ఆర్డర్లు ఇచ్చారని.. అసలు రేట్ కాంట్రాక్ట్‌ లో లేని కంపెనీలకు కోట్ల రూపాయలు చెల్లించినట్లు తేలింది. అయితే.. తెలంగాణ (Telangana) లో కాస్త అటూఇటూగా ఇలాంటి స్కామే తాజాగా వెలుగుచూసింది. టెలీ మెడిసిన్‌ సేవల పేరుతో డబ్బు కాజేసే ప్రయత్నం జరుగుతునట్టు సమాచారం.

Another Scam in ESI

గతంలో ఈఎస్‌ఐ డిస్పెన్సరీల్లో టెలీ మెడిసిన్‌ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మేరకు డిస్పెన్సరీలను రెండుగా విభజించి.. వీఆర్‌ టెలీ హెల్త్‌ పరిధిలోకి తీసుకొచ్చారు. 2017 నుంచి 2019 వరకు ఆయా డిస్పెన్సరీల్లో అవసరమైన రోగులకు ఈసీజీలు తీసి వారి ప్యానెల్‌ ఆఫ్‌ డాక్టర్స్‌ కు పంపించి అవసరమైన సలహాలిప్పించడం ఈ సేవల ఉద్దేశం. అయితే.. వీఆర్‌ టెలీ హెల్త్‌ సర్వీసెస్‌ సిబ్బంది హాజరు, సేవల పర్యవేక్షణ వంటి అంశాలను ఐఎంఓల పరిధిలోకి తీసుకురాలేదు. ఇదే సమయంలో ఈఎస్‌ఐలో మందుల కుంభకోణం వెలుగు చూసింది. ఇతర కారణాలతో వీఆర్‌ టెలీ హెల్త్‌ సంస్థకు చెల్లింపులు సాధ్యం కాలేదు. తాజాగా మరోసారి ఈ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు.

వీఆర్ టెలీ హెల్త్ సర్వీస్ కి కోట్ల రూపాయల క్లియరెన్స్ ఇవ్వాలని ఐఎంవోలపై ఒత్తిడి పెరుగుతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన రికార్డుల మెయింటనెన్స్‌ డిస్పెన్సరీల స్థాయిలో చేయకపోవడంతో ప్రూఫ్‌ ఆఫ్‌ వర్‌ ను ఎలా సమర్పించాలో అర్థం కాక ఐఎంఓలు తల పట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. 2017లో వీఆర్ టెలీ హెల్త్ కంపెనీ రిజిస్ట్రేషన్ కాలేదని సమాచారం. మరో కంపెనీ వివరాలు వరంగల్ ఈఎస్ఐ హాస్పటల్ సూపరింటెండెంట్ అడ్రస్ పై నమోదు ఉన్నాయి. ఈసీజీ కోసం టెండర్స్ లేకుండానే ఒక్కొక్క దానికి రూ.600లకు పైగా బిల్లింగ్ చేసినట్లు సమాచారం. ఒక్క ఈసీజీ తీసి 10 ఈసీజీల పేర్లు నమోదు చేశారని అభియోగాలు ఉన్నాయి.

బిల్లులు చెల్లించేందుకు జాయింట్ డైరెక్టర్ తో పాటు ఓ కమిటీని వేసి క్లియర్ చేసుకుంటున్నట్టు సమాచారం. వీరిపై మాజీ ఏంపీ వినోద్, సీఏంవో ఆఫీస్ నుంచి భూపాల్ రెడ్డి నుంచి ఒత్తిడి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. 70 డిస్పెన్సరీల ఇంఛార్జీలు ససేమిరా అంటున్నారు. మెడికల్ స్కాం అవకతవకలతోనే తాము ఎప్పుడు బలవుతామోనని ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు కళ్లు తెరవాలని డిమాండ్ వినిపిస్తోంది. ప్రజల సొమ్మును ఎలాంటి టెండర్స్ లేకుండా ప్రైవేట్ కంపెనీలకు దోచి పెట్టడాన్నితప్పుబడుతున్నారు కొందరు.

గతంలో ఈఎస్ఐ లో మెడికల్ కిట్ల కోనుగోలు స్కాం జరిగింది. ఏసీబీ 9 మందిని అరెస్ట్ చేసి కోట్ల రూపాయల స్కాం జరిగిందని తేల్చింది. అప్పటి డైరెక్టర్ దేవికారాణితో పాటు కొందరి పేర్లు తెరపైకి వచ్చాయి. దేవికారాణి అక్రమంగా 450 కోట్లు సంపాదించిందని ఏసీబీ చెప్పింది. ఈడీ కేసు నమోదు.. ఆస్తులు అటాచ్మెంట్ చేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల ఓనర్లు కటకటాల పాలయ్యారు. కళ్ల ముందు ఈ స్కాం కదలాడుతుండగానే ఇప్పుడు అక్రమ బిల్లులకు తెర లేపారని అనుకుంటున్నారు జనాలు.

You may also like

Leave a Comment