Telugu News » Delhi Liquer Scam : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో సంచలనం.. కవిత, కేజ్రీవాల్‌ రూ.వేల కోట్లు దోచారన్న సుఖేశ్ చంద్రశేఖర్!

Delhi Liquer Scam : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో సంచలనం.. కవిత, కేజ్రీవాల్‌ రూ.వేల కోట్లు దోచారన్న సుఖేశ్ చంద్రశేఖర్!

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవితపై ఆది నుంచి సుఖేశ్ ఆరోపిస్తున్నారు. అందుకు సంబంధించి కవిత, సుఖేశ్ మధ్యలో జరిగిన వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్స్ ఆయన గతంలోనే విడుదల చేసి సంచలనం సృష్టించారు.

by admin
another-sensation-in-the-delhi-liquor-scam-case-kavitha-kejriwal-robbed-thousands-of-crores-by-sukesh-chandrasekhar

ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquer scam) కేసులో అరెస్టై మండోలి జైలులో శిక్ష అనుభవిస్తున్న సుఖేశ్ చంద్రశేఖర్ (Sukesh chandra shekar) మరో లేఖ(Letter Release)ను విడుదల చేశారు. ఇందులో ఎమ్మెల్సీ కవిత(Kavitha), ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (Cm Kejiriwal) గురించి సంచలన ఆరోపణలు చేశారు. త్వరలోనే వీరిద్దరూ తీహార్ జైలుకు వస్తారని, ఇప్పటికే వీరికి వ్యతిరేకంగా సాక్ష్యాలు సిద్ధమయ్యాయని అందులో పేర్కొన్నారు.ఇన్ని రోజులు అబద్ధపు సాక్ష్యాలు, అక్రమ అరెస్టులు అంటూ కవితక్క చేసిన ఆరోపణలు అన్నీ నిజం కాబోతున్నాయి. నిజం గెలవబోతున్నదని సుఖేశ్ స్పష్టంచేశారు. మండోలి జైలు నుంచి సుఖేశ్ విడుదల చేసిన లేఖలోని ముఖ్యమైన అంశాలను ఒక్కసారి పరిశీలిద్దాం.

another-sensation-in-the-delhi-liquor-scam-case-kavitha-kejriwal-robbed-thousands-of-crores-by-sukesh-chandrasekhar

 

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవితపై ఆది నుంచి సుఖేశ్ ఆరోపిస్తున్నారు. అందుకు సంబంధించి కవిత, సుఖేశ్ మధ్యలో జరిగిన వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్స్ ఆయన గతంలోనే విడుదల చేసి సంచలనం సృష్టించారు. సౌత్ గ్రూపు పేరుతో లిక్కర్ సిండికేట్ క్రియేట్ చేశారని, కవిత గ్రూపులోని వారికి అనుకూలంగా మద్యం పాలసీని తయారు చేసినందుకు గాను ఢిల్లీ ప్రభుత్వంలోని పెద్దలకు రూ.100 కోట్లు ముడుపులు అక్రమ మార్గంలో అందాయని సుఖేశ్ గతంలోనే పేర్కొన్నారు.మద్యం పాలసీని రూపొందించిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఈ కేసులో అరెస్టై జైలులో ఉన్నారు.

తాజాగా సుఖేశ్ విడుదల చేసిన లేఖలో.. ‘కవితక్క అరెస్టు ద్వారా అవినీతి రారాజు కేజ్రీవాల్ సహా అవినీతి సహచరులందరి పేర్లు బట్టబయలు కాబోతున్నాయి.నిజమే గెలిచింది, ఫేక్ కేసులు, బూటకపు ఆరోపణలు, రాజకీయ కక్షసాధింపులు అని ఆరోపణ చేసిన మీకు మీ కర్మలన్నీ నీకే తిరిగి వస్తున్నాయంటూ కవితను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ను అధికారం నుంచి తెలంగాణ ప్రజలు దించేశారు.కవితక్క తీహార్ జైల్‌కి రావడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో నువ్వు నీ పార్టీ దోచుకుని దోచుకుని దాచిన రూ. వేల కోట్లు అన్ని బయటకు వస్తాయి.

ఎవరి గురించి నేను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానో మీరు, మీ సంబంధిత వ్యక్తులు అర్థం చేసుకున్నారని నేను కచ్చితంగా అనుకుంటున్నాను.
కవితక్క మీ నెయ్యి డబ్బా కథలు, రేంజ్ రోవర్ కలెక్షన్ కథలు, గోవా కథలు, కాంట్రాక్ట్ కథనాలు, గత సంవత్సరం నేను షేర్ చేసిన వాట్సాప్ స్క్రీన్ షాట్‌ల ప్రకారం దర్యాప్తు జరుగుతోంది.ముందు చెప్పినట్లుగా అవినీతిలో మీ ప్రమేయం ఉన్నట్లు నేను బయటపెట్టినా మీరు ఎప్పుడు నాకు అక్కగానే ఉంటారు.మీకు (కవిత)కు హృదయపూర్వకంగా నేనొక సలహా ఇస్తున్నాను. ఇప్పటికీ అన్ని దాచిపెట్టి ఈ కుంభకోణం కింగ్ ఫిన్ & గాడ్ ఫాదర్ అయిన అరవింద్ కేజ్రీవాల్‌ను రక్షించడానికి ప్రయత్నించడం వల్ల ప్రయోజనం లేదు.

ఈ దేశ ప్రజలకు, కోర్టులకు అందరికీ నిజం తెలుసు. మీ అవినీతిని నిరూపించడానికి తగిన సాక్ష్యాలు ఉన్నాయి.ఏదేమైనా త్వరలోనే ఈడీ,సీబీఐ వద్ద చట్ట ప్రకారం విచారణకు ఎదుర్కొనేందుకు మిమ్మల్ని కలుస్తాను అక్క. తిహార్ జైలు మీరు సుదీర్ఘంగా ఉండటం కోసం విలాసవంతమైన భవనం. మీకోసం తీహార్ జైల్లో మీ మరో సోదరుడు అవినీతి చక్రవర్తి అరవింద్ కేజ్రీవాల్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారని నేను అనుకుంటున్నాను.

నా ప్రియమైన కేజ్రీవాల్ మీరు ఎంత ప్రయత్నించినా ఇప్పుడు మీ అబద్ధాలు డ్రామాలన్నిటికీ ఇది క్లైమాక్స్‌గా మారబోతోంది. నా ప్రియమైన కేజ్రీవాల్ జీ నీ సొంత తీహర్ జైలులో ఉన్న సోదరులు,సోదరిమనుల వద్దకు మీరు కూడా త్వరగా రండి’ అంటూ సుఖేశ్ సంచలన కామెంట్స్ చేశారు.

You may also like

Leave a Comment