Telugu News » జైల్లో చంద్రబాబుకి ప్రత్యేక వైద్య బృందం!

జైల్లో చంద్రబాబుకి ప్రత్యేక వైద్య బృందం!

చంద్రబాబుకు ఆకస్మాత్తుగా ప్రత్యేక వైద్య బృందం ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.

by Sai
ap-government-key-decision-on-chandrababu-health-in-jail-deputed-special-medica-team-for-chandrababu

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక వైద్య బృందాన్ని నియమించింది. అంతేకాకుండా కొన్ని సూచనలు జారీ చేసింది.

ap-government-key-decision-on-chandrababu-health-in-jail-deputed-special-medica-team-for-chandrababu

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో జైలులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్యంపై ప్రతిపక్షాలు ఆభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపధ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక సూచనలు చేసింది. మొత్తం 10 మందితో వైద్య బృందాన్ని ఏర్పాటు చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందులో ఐదుగురు వైద్యులు, ముగ్గురు వైద్య సిబ్బంది, ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. వైద్యబృందంలో ముగ్గురు వైద్యులు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి చెందినవారు కాగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నియంత్రణలో ఉంటారు. మరో ఇద్దరు వైద్యులు జిల్లా వైద్య సేవల సమన్వయ అధికారి పరిధిలో ఉంటారు.

అటు వైద్య బృందంతో ఏర్పాటుతో పాటు రెండు యూనిట్ల ఒ పాజిటివ్ రక్తాన్ని అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. అత్యవసర మందులు కూడా సిద్ఘంగా ఉంచాలని ఆదేశించింది. ఉన్నట్టుండి చంద్రబాబుకు ఆకస్మాత్తుగా ప్రత్యేక వైద్య బృందం ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.

చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించినప్పట్నించి రాజమండ్రి సెంట్రల్ జైలు అంశాలు చర్చనీయాంశమౌతున్నాయి. చంద్రబాబు భద్రతపై కుటుంబసభ్యులు, టీడీపీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో చంద్రబాబుకు సంబంధించి అధికారులు తీసుకునే ప్రతి నిర్ణయంపై చర్చ జరుగుతోంది. ఆఖరికి భార్య ఆరోగ్యం బాగాలేక 4 రోజులు సెలవు పెట్టిన జైలు సూపరింటెండెంట్ రాహుల్ అంశంపై కూడా పెద్దఎత్తున రచ్చ జరిగింది.

ఈ అంశంపై జైళ్ల శాఖ వివరణ ఇచ్చుకోవల్సి వచ్చింది. రాహుల్ భార్య కొద్దికాలంగా అనారోగ్యంతో ఉన్నారని..భార్యను చూసుకునేందుకు ఆయన 4 రోజులు సెలవు పెట్టారని జైళ్ల శాఖ డీఐజీ రవికుమార్ వివరించారు. నిన్న సాయంత్రం రాహుల్ భార్య అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని వక్రీకరించవద్దని జైళ్ల శాఖ మీడియాకు విజ్ఞప్తి చేశారు.

సీమెన్స్‌ ప్రాజెక్టులో ఆ సంస్థ 90% గ్రాంటు, రాష్ట్ర ప్రభుత్వం 10% వాటా చెల్లిస్తుందని ఒప్పందంలో ఉందని, మంత్రివర్గ సమావేశంలోనూ ఇదే విషయాన్ని తీర్మానించారని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ స్పష్టం చేశారు. నైపుణ్య శిక్షణకు సంబంధించి ఏపీతో కలిసి పనిచేసేందుకు ఆతృతగా ఉన్నామని సీమెన్స్ ఉన్నతాధికారులు మెయిల్స్‌ పంపడమే కాదు.. అప్పుటి ఒప్పందంపై ఆ సంస్థ ఉన్నతాధికారులు సంతకాలు కూడా చేశారని తెలిపారు.

కానీ సిద్ధం చేసుకున్న అబద్ధాలతో చంద్రబాబును దోషిగా చూపిస్తున్న ప్రభుత్వం, సీఐడీలు.. ప్రాజెక్టు ఒప్పందంలోని అంశాలను కావాలనే దాచి పెడుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ఈ విషయంతో సీమెన్స్ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని..షెల్‌ సంస్థలకు నిధులు మళ్లించిందంటూ చంద్రబాబుపై ఆరోపణలు చేసి అరెస్ట్ చేయించించారని మండిపడ్డారు. ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వం మదింపు సంస్థ సీమెన్స్ ప్రాజెక్ట్‌లోని సాప్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ను మదించి నిర్థిరించినా.. అక్కడ సాప్ట్‌వేరే లేదంటూ బుకాయిస్తోందని అన్నారు. ఈ క్రమంలో టీడీపీ పట్టాభిరామ్.. చంద్రబాబు అరెస్టు కేసులో నిజనిజాలు ఏంటో ప్రజలకు అర్ధమవుతున్నాయని పట్టాభి పేర్కొన్నారు.

You may also like

Leave a Comment