Telugu News » Asia Games : క్రికెట్ లో గోల్డ్, అదగగొట్టిన అమ్మాయిలు !

Asia Games : క్రికెట్ లో గోల్డ్, అదగగొట్టిన అమ్మాయిలు !

ఆసియా క్రీడల్లో బంగారు పతకాన్ని సాధించిన భారత్ మహిళ క్రికెట్ జట్టును  కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ అభినందించారు.

by Prasanna
Asia games

ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో (Asia Games) భారత మహిళా క్రికెట్‌ జట్టు (Indian Women Cricket Team) చరిత్ర సృష్టించింది. పాల్గొన్న తొలి ఏషియన్ గేమ్స్‌లోనే గోల్డ్‌ మెడల్ సాధించింది. సోమవారం శ్రీలంక (Srilanka) తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 19 పరుగుల తేడాతో గెలుపొంది ఈ ఫీట్‌ను సాధించింది.

Asia games

ఆసియా క్రీడల్లో బంగారు పతకాన్ని సాధించిన భారత్ మహిళ క్రికెట్ జట్టును  కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ అభినందించారు. ఈవెంట్‌లో వారి అసాధారణ ప్రదర్శనను కొనియాడారు. క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా మహిళల జట్టును అభినందించారు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ఓపెనర్‌ స్మృతి మందాన (46), వన్‌డౌర్‌ బ్యాటర్‌ రోడ్రిగ్స్‌ (42) పరుగులతో రాణించారు. మిగతా బ్యాటర్లలో ఎవరూ కూడా డబుల్‌ డిజిట్‌ స్కోరు చేయలేదు.

అనంతరం భారత్ నిర్దేశించిన 117 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 14 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. చివరకు 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 97 పరుగులకే పరిమితమైంది. భారత స్పిన్నర్లు ఎదుర్కొనేందుకు శ్రీలంక బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా టిటాస్‌ సాధు 4 ఓవర్లు వేసి 6 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. దీంతో భారత్…19 పరుగుల తేడాతో గెలిచి గోల్డ్‌ మెడల్‌ సొంతం చేసుకుంది.

కాగా ఆసియా క్రీడల్లో ఇంతకు ముందు రెండు సార్లు 2010, 2014లో క్రికెట్‌ను భాగం చేశారు. కానీ రెండు సార్లు కూడా బీసీసీఐ మన జట్టును బరిలోకి దించలేదు. కానీ ఈసారి మాత్రం మహిళలు, పురుషుల జట్టును బరిలోకి దింపింది. టీ20 ఫార్మాట్‌లో జరుగుతున్న క్రికెట్‌లో మహిళల పురుషుల జట్టు వరుస విజయాలతో స్వర్ణ పతకాన్ని కొల్లగొట్టింది. Top of FormBottom of Formఈ విజయం భారత క్రికెట్ చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టమని క్రికెటర్ విశ్లేషకులు అంటున్నారు.

You may also like

Leave a Comment