కాంగ్రెస్, ఎమ్ఐఎం, బీఆర్ఎస్ మూడు పార్టీలు ఒకటేనని అసోం సీఎం హిమంత బిస్వ శర్మ (Himantha Biswa Sharma) అన్నారు. ఏఐఎంఐఎం నేత అసద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) యూపీ, హర్యానాలకు వచ్చి చూడాలన్నారు. అక్కడకు వస్తే ఐదు నిమిషాల్లో ఆయన ఇసాబ్ పూర్తి చేస్తామని తెలిపారు. తెలంగాణలో బీజేపీ జెండాను ఎగురవేస్తామని వెల్లడించారు.
వికారాబాద్ జిల్లా పరిగిలో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా సీఎం హిమంత బిస్వ శర్మ ప్రచారం చేపట్టారు. బీజేపీ అభ్యర్థి మారుతి కిరణ్ కు మద్దతుగా రోడ్ షోలో పాల్గొని హిమంత బిస్వ శర్మ మాట్లాడుతూ… రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని అన్నారు. దళితున్ని సీఎం చేస్తానన చెప్పి ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేశారని ధ్వజమెత్తారు.
ప్రజలందరికీ న్యాయం చేసే పరిపాలన కేవలం బీజేపీతోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెబుతోందన్నారు. ముస్లింల కోసం ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ అంటున్నాడన్నారు. హైదరాబాద్‌కు ఏ పార్టీలు వచ్చిన ఓవైసీకి జిందాబాద్ కొడుతున్నాయని ఫైర్ అయ్యారు. మొన్న హైదరాబాద్‌లో పోలీసులకు ఓవైసీ దంకీ ఇచ్చాడన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. పరిగిలో ఎమ్మెల్యే అభ్యర్థి మారుతి కిరణ్ కు ఒక్క అవకాశం ఇవ్వాలన్నారు. ప్రజలంతా మారుతి కిరణ్ కు ఓటు వేసి గెలిపించాలన్నారు. మారుతి కిరణ్ ను గెలిపిస్తే పరిగి నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తామని హిమంత బిస్వ శర్మ హామీ ఇచ్చారు.