Telugu News » Ap assembly :తొలిరోజు సమావేశంలో టీడీపీ నేతల నిరసన!

Ap assembly :తొలిరోజు సమావేశంలో టీడీపీ నేతల నిరసన!

తొలుత ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ తర్వాత నేరుగా అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరారు

by Sai
assembly-sessions-of-ap-have-started-on-the-first-day-of-the-meeting-tdp-leaders-came-to-the-meeting-with-their-protests

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు(Ap Assembly) ప్రారంభమయ్యాయి. తొలిరోజు సమావేశానికి టీడీపీ నేతలు(Tdp Leaders) తమ నిరసనలు తెలుపుతూ సభకు వచ్చారు. చంద్రబాబును(CBN) వెంటనే విడుదల చేయాలని, ఆయనపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లకార్డు చేత బూని సభకు వచ్చారు.

assembly-sessions-of-ap-have-started-on-the-first-day-of-the-meeting-tdp-leaders-came-to-the-meeting-with-their-protests

తొలుత ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ తర్వాత నేరుగా అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరారు.అయితే సభ ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. టీడీపీ సభ్యులు మాత్రం తమ నినాదాలు చేస్తూనే ఉన్నారు.

నినాదాల మధ్యనే సభను కొనసాగిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమంటూ టీడీపీ వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టడంతో స్పీకర్ పోడియం వద్దకు చేరి టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నారు. దీంతో ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. స్పీకర్ ను వెంటనే తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబడుతున్నారు.

You may also like

Leave a Comment