నిన్న, మొన్నటివరకు హైదరాబాద్(Hyderabad) మహా నగరానికే పరిమితమైన మాదకద్రవ్యాలు(Intoxicants)( ప్రస్తుతం రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు పాకాయి. తాజాగా ఓ పదో తరగతి అమ్మాయి(10th class girl Addict) మత్తుపదార్థాలకు బానిసైన ఘటన జగిత్యాల(Jagityala) జిల్లాలో శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జిల్లాలోనే పెను సంచలనం సృష్టించింది.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. బాధిత విద్యార్థిని తండ్రి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి రాగా శనివారం ఈ కేసులో సంచలన నిజాలను జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. జగిత్యాలలో పదో తరగతి చదివే ఓ అమ్మాయి గత కొన్నిరోజులుగా వింతగా ప్రవర్తిస్తోంది. దీనిపై తండ్రి ఆరా తీయగా.. ఆమె మత్తుపదార్థాలకు బానిసైనట్లు తండ్రి గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వెంటనే రంగంలోకి దిగిన శిశు సంరక్షణ కమిటీ దర్యాప్తు జరిపింది. ఆ అమ్మాయితో పాటు ఇతర విద్యార్థినిలు సైతం మత్తుకు బానిసైనట్లు విచారణలో తేల్చారు. మొత్తం 10 మంది అమ్మాయిలు మాదకద్రవ్యాలు తీసుకుంటున్నారని తేలింది.
ఓ సెక్స్ రాకెట్ ముఠా వీరికి మత్తు పదార్థాలను అందించడంతో పాటు అప్పుడప్పుడు వీరిని హైదరాబాద్లో జరిగే రేవ్ పార్టీలకు తరలిస్తుంటారు. అలా చేస్తే ఈ ముఠాకు రూ.30వేలు అందుతున్నట్లు తెలిసింది. ఈ తరుణంలో నార్కోటిక్ బ్యూరో అధికారులు రంగంలోకి దిగారు.సెక్స్ రాకెట్ ముఠాపై లోతుగా దర్యాప్తు ప్రారంభించారు.
తాజాగా ఈ ఘటనలో ఐదుగురు సభ్యుల సెక్స్ రాకెట్ ముఠాను శనివారం అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. విశాఖ నుంచి జగిత్యాలకు మత్తు పదార్థాలు సరఫరా జరుగుతున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు.ఈ ముఠా చదువు మధ్యలోనే మానేసి ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నదన్నారు.సీలేరు నుంచి గంజాయి తెచ్చి జగిత్యాలలో చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి అమ్ముతున్నట్లు గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు.