Telugu News » Kejiriwal : మరో లేఖ విడుదల చేసిన సుఖేశ్ చంద్రశేఖర్.. కేజ్రీవాల్‌పై సంచలన ఆరోపణలు!

Kejiriwal : మరో లేఖ విడుదల చేసిన సుఖేశ్ చంద్రశేఖర్.. కేజ్రీవాల్‌పై సంచలన ఆరోపణలు!

లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్‌(CM Kejiriwal)ను ఈడీ (ED) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మండోలి జైలు(Mandoli jail) నుంచి అదే కేసులో అరెస్టైన సుకేశ్ చంద్రశేఖర్ మరో లేఖను(Letter Release) విడుదల చేశారు. ఈసారి ప్రత్యేకంగా అందులో కేజ్రీవాల్ గురించి ప్రస్తావించారు.

by Sai

లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్‌(CM Kejiriwal)ను ఈడీ (ED) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మండోలి జైలు(Mandoli jail) నుంచి అదే కేసులో అరెస్టైన సుకేశ్ చంద్రశేఖర్ మరో లేఖను(Letter Release) విడుదల చేశారు. ఈసారి ప్రత్యేకంగా అందులో కేజ్రీవాల్ గురించి ప్రస్తావించారు. ఎప్పటిలాగే సత్యం గెలుస్తుందని కేజ్రీవాల్ అరెస్టు నూతన భారతదేశం యొక్క క్లాసిక్ ఉదాహరణగా పేర్కొన్నారు.చట్టానికి ఎవరూ అతీతులు కాదని చూపించడానికి నిదర్శనం ఢిల్లీ సీఎం అరెస్టు అని రాసుకొచ్చారు.

Sukesh Chandrasekhar released another letter. Sensational allegations against Kejriwal

‘నా ప్రియమైన కేజ్రీవాల్ జీ ముందుగా నేను మిమ్మల్ని స్వాగతించే ప్రత్యేక హక్కులు తీసుకుంటున్నాను. మార్చ్ 25న నా బర్త్ డే కావడం నాకు చాలా సంతోషం.మీ అరెస్టును నాదిగా భావిస్తూ 2 రోజుల ముందు నుంచే వేడుక జరుపుకుంటున్నాను.నేను ఉత్తమ బర్త్ డే అందుకుంటున్నానని భావిస్తున్నాను. తీహార్ క్లబ్ పోస్టులు నడపడానికి నా ముగ్గురు సోదరులు ఇక్కడ ఉన్నందున నేను హ్యాపీ. చైర్మన్ బిగ్‌బాస్ కేజ్రీవాల్,సీఈవో మనీష్ సిసోడియా, సీఓఓ సత్యేంద్ర జైన్ అంటూ లేఖలో ప్రస్తావించారు.

బ్రదర్ కేజ్రీవాల్ మీ అవినీతి అంతా బయటపడుతోంది. మీరు సీఎం హోదాలో పది రకాల స్కామ్స్ చేశారు.ఢిల్లీలోని పేదలను లూటీ చేశారు, 4 స్కామ్స్ నేను స్వయంగా చూశాను, సాక్షాలు అన్ని నా దగ్గర ఉన్నాయి. మీరు చేసిన అవినీతి అక్రమాలు అన్ని నేను బయటపెడతాను.కేజ్రీవాల్ జీ మీరు ఇంకెప్పుడు తీహార్ జైలు బయట వెలుతురుని చూడలేరు. మీరు మీ ఇద్దరి సోదరులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ కూడా రాలేరు.

ఢిల్లీలోని పేద రోగులకు నకిలీ మందులను అందించడం, పేద పిల్లల చదువుల డబ్బును స్వాహా చేయడం, సహజ నీటి వనరులకు సంబంధించిన డబ్బును కూడా దోచుకున్నారు. మీరు చేసిన పనులే మీకు తిరిగి కర్మ ఫలితంగా మారుతున్నాయి.కేజ్రీవాల్ జీ నాకు తెలుసు మీరు జైలుకెళ్లిన పరవాలేదని అనుకుంటారని,తీహార్ జైలు మీ నియంత్రణలోనే ఉంటుందని నాకు తెలుసు. ఇక్కడి అధికారులు మీరు చెప్పినట్లే వింటారని మీరు అనుకుంటున్నారు.

మీరు జైల్లోనే ఉండి నాపై ప్రతీకారం తీసుకుంటారని కూడా నాకు తెలుసు. మీ అవినీతి భాగస్వాముల మీద ఏ విధంగా సాక్ష్యాధారాలను సమర్పించానో ఇప్పుడు కూడా అవే జైలు నుండే బహిర్గతం చేస్తాను. మీ సహచరులందరూ నన్ను దొంగ, మోసగాడు అని పిలిచారు. త్వరలోనే మీతో మాట్లాడతాను, అన్ని ఆధారాలతో నా సోదరి కవిత అక్కతో ముఖాముఖి కోసం ఎదురుచూస్తున్నాను. ఈ ఏడాది నాకు ఒక అద్భుతమైన పుట్టినరోజు బహుమతి అందించినందుకు ఈడీ, సీబీఐకి ధన్యవాదాలు. మీ అరెస్ట్ ఈ ఏడాదికి నా బర్త్ డే గిఫ్ట్. నా బ్రదర్ కేజ్రీవాల్ జీ నేను చెప్పినవన్నీ నిజమయ్యాయి’ అంటూ సుకేశ్ మరో సంచలనం సృష్టించారు.

You may also like

Leave a Comment