హేమలత లవణం ఎవరు అన్న ప్రశ్న చాలా మందిలో ఉంది. హేమలత లవణం గురించి చాలామందికి తెలియని విషయాలు ఇవి. హేమలత గుంటూరు జిల్లా వినుకొండ కు చెందిన తెలుగు కవి గుర్రం జాషువా మరియమ్మ కూతురు. 1932 ఫిబ్రవరి 26న ఆమె పుట్టారు. ఆమె తన విద్యను అంతా గుంటూరులో సాగించారు. ఆమె మద్రాస్ క్వీన్స్ కాలేజీలో బీఏ చదివి బంగారు పతాకాన్ని పొందారు. తర్వాత గోపరాజు రామచంద్రరావు కొడుకు గోపరాజు లవణంతో ఆమెకి పెళ్లయింది. అప్పట్లో వర్ణ వివక్షను ఎదిరించి చేసుకున్న ఆమె వివాహం అప్పట్లో సంచలనాల్ని కలిగించింది.
తర్వాత ఆమె వినోబాభావే భూదాన యాత్రలో చంబల్లోయలో పర్యటించి బందిపోటు దొంగల్లో మానసికంగా ప్రవర్తన తెచ్చేందుకు కృషి చేశారు. అంతేకాకుండా హేమలత లవణం శ్రీకాకుళం కృష్ణాజిల్లాలో ఆర్థిక సమతా మండలి అనే సేవా సంస్థని స్థాపించారు దిగువ కులాల చైతన్యం కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు. 1981లో కావలిలో నవ వికాస్ అనే సంస్థని స్థాపించారు. మహిళల జోగిని వ్యవస్థ పై కూడా ఈమె పోరాటం చేశారు. జోగినులను వాళ్ళ పిల్లల్ని కాపాడేందుకు సంస్కార్ చెల్లి నిలయం అనే సంస్థలు ఏర్పాటు చేశారు.
Also read:
బాణమతి లాంటి గుడ్డి నమ్మకాలతో మహిళల్ని వాళ్ల జీవితాల్ని ధ్వంసం చేస్తున్న వాటికి వ్యతిరేకంగా పోరాడారు హేమలత లవణం. జోగినీ వ్యవస్థ నిర్మూలనకు హేమలత చేసిన కృషి ఫలితంగానే ఎన్టీ రామారావు ప్రభుత్వం జోగిని వ్యవస్థ నిర్మూలన చట్టాన్ని తీసుకొచ్చింది. హేమలత లవణం పాత్రలో రేణు దేశాయ్ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కనబడి రియంట్రి ఇచ్చి అందర్నీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.