ప్రభాస్ హీరోగా వచ్చిన, సలార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్ అయింది. బాహుబలి సినిమా తర్వాత, సరైన హిట్ కోసం ప్రభాస్ ఎంతగానో ప్రయత్నం చేశారు. కానీ, బాహుబలి సినిమా తర్వాత ఏ సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఇప్పుడు సలార్ సినిమా బాహుబలి సినిమా తర్వాత హిట్ అయింది. సలార్ బాక్స్ ఆఫీస్ సునామీని ఆపే సూచనలు కనపడట్లేదు. సలార్ సినిమాకి సంబంధించి, ఒక ఆసక్తికరమైన విషయం తెర మీదకి వచ్చింది. సినిమా గురించి ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు. అయితే, అసలు సలార్ కి ఆ టైటిల్ ఎందుకు పెట్టారు..? దాని వెనుక కారణం ఏంటి అని, ప్రతి ఒక్కరు కూడా, చర్చించుకోవడం జరుగుతుంది.
సలార్ అంటే ఎవరికీ తెలీదు. చాలామంది సలార్ అంటే పేరు ఈ సినిమాలో ప్రభాస్ పేరు సలార్ అని అనుకుంటున్నారు. అయితే, ఇది నిజం కాదు. ఇక మరి దీని అర్థం ఏంటనేది చూస్తే… ఇది ఒక ఉర్దూ పదం అని తెలుస్తోంది. దీని అర్థం నాయకుడు. సమర్థతతో కూడిన బలమైన నాయకుడుని సలార్ అంటారు. ప్రభాస్ క్యారెక్టర్ కి సెట్ అయ్యే విధంగా ప్రశాంత్ నీల్ ఉర్దూ పదాన్ని తీసుకురావడం జరిగింది. పైగా ఈ పదం పలకడానికి మాస్ గా పవర్ ఫుల్ గా ఉంటుంది. సలార్ టైటిల్ వెనుక అసలు కారణం ఇది. కేజిఎఫ్ లో లాగ ప్రశాంత్ నీల్ ఇందులో కూడా, ఒక కల్పిత పదాన్ని సృష్టించడం జరిగింది.
Also read:
ఖాన్సర్ అనే సామ్రాజ్యంపై నడిచే ఆదిపత్యపు స్టోరీ. సినిమాని ఇద్దరు మిత్రులు కోణంలో చెప్పారు. ప్రభాస్ పృథ్వీరాజ్ ఆ మిత్రులుగా నటించడం జరిగింది. సలార్ పార్ట్ 2 కూడా వస్తుంది. అసలు కథ అంతా పార్ట్ 2 కోసం దాచి పెట్టారు. పార్ట్ వన్ చూసిన వాళ్ళకి చాలా ప్రశ్నలు మిగిలిపోయాయి. సమాధానాలు అన్నీ కూడా పార్ట్ టూ లో చూడాలి. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించారు. జగపతిబాబు, బాబి సింహ, ఈశ్వరి ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.