హన్మకొండ జిల్లా(Hanmakonda)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎల్కతుర్తి(Alkathurthi) మండలం శాంతి నగర్(Shanthinagar) సమీపంలో వేగంగా దూసుకొచ్చిన లారీ(Lorry) అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారు(Car)ను ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
గాయాలపాలైన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలానికి చెందిన అన్నదమ్ముల కుటుంబాలు వేములవాడ రాజన్న దర్శనానికి ఒకేకారులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులోని మంతెన కాంతయ్య (72), మంతెన శంకర్(60), చందన(16), మంతెన భారత్ (29), మంతెన అక్కడికక్కడే మృతిచెందారు.
ఈ ఘటనలో మంతెన రేణుక, భార్గవ్, శ్రీదేవిలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జయింది. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. నలుగురి మృతదేహాలను ఎంజీఎం మార్చురీకి తరలించారు. స్థానికులు, జేసీబీ సాయంతో కారులో ఇరుక్కుపోయిన వారిని అతికష్టంమీద బయటకు తీయాల్సివచ్చింది.
ఇక, విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మంచు, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా, బాధితులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో ఏటూరునాగారంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.