Telugu News » సలార్ సినిమాలో ప్రభాస్‌కు ముందు.. హీరోగా ఎవరిని అనుకున్నారో తెలుసా..?

సలార్ సినిమాలో ప్రభాస్‌కు ముందు.. హీరోగా ఎవరిని అనుకున్నారో తెలుసా..?

by Sravya

నటుడు ప్రభాస్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ప్రభాస్ మంచి హిట్ సినిమా కోసం చాలా కాలం నుండి ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ బాహుబలి సినిమా హిట్ తర్వాత మంచి హిట్ రావాలని ఎంతగానో ట్రై చేశారు. కానీ ఇప్పుడు సలార్ సినిమాతో హిట్ కొట్టారు. ప్రభాస్ నటించిన సలార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుని భారీగా వసూళ్లని రాబడుతోంది. సలార్ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన విషయం తెలిసింది. అయితే ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి హీరోగా మొదట ప్రభాస్ ని అనుకోలేదట. ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడని అందరూ ఎదురు చూశారు.

Salaar movie: Salaar siege fire is over.. and the title of part-2 is the same..!

ఆయన హీరో ఎవరు అనేది ముందే ఫిక్స్ అవ్వకుండా కథని రాసుకున్నారట. ఆ కథ రాసుకుంటున్న టైంలో ముందుగా తమిళ హీరో సూర్య ని దృష్టిలో పెట్టుకుని కథని రాశారు కానీ కథ గురించి చెప్పేటప్పుడు హీరోగా ప్రభాస్ ఐతే బాగుంటుందని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ సూచించారట. ఎందుకంటే సినిమాలో హీరోకి కొన్ని బలమైన శక్తులు ఉన్నట్లుగా కథలో రాసుకున్నారు. అలాంటివి నమ్మాలంటే కటౌట్ కూడా ఆ స్థాయిలో ఉండాలని అందుకే ప్రభాస్ ని హీరోగా పెట్టాలని అనుకున్నారు.

Also read:

తను అసిస్టెంట్ మాటలతో ఆలోచనలో పడిన ప్రశాంత్ కటౌట్ గట్టిగా ఉన్న హీరో అయితే బాగుంటుందని భావించారు ఆ టైంలో ప్రభాస్ డేట్స్ కూడా దొరికే అవకాశం కనిపించడంతో ప్రభాస్ కి కథ చెప్పారు. ప్రభాస్ ఒప్పుకోవడంతో సినిమా పట్టాల మీదకి ఎక్కింది. తాజాగా ఈ విషయాలు బయటకు వచ్చాయి ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మొదటి రెండు రోజుల్లోనే దాదాపుగా 300 కోట్ల వరకు గ్రాస్ ఈ సినిమా రాబట్టింది మొదటి వారంలో ఎన్ని వందల కోట్లు రాబడుతుంది ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుంది అనేది చూడాలి

You may also like

Leave a Comment