తెలంగాణ ఎన్నికల్లో ఊహించని విధంగా ఫలితాలొచ్చాయి. కేసీఆర్ పార్టీ ఈ ఎన్నికల్లో ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చింది. రేవంత్ రెడ్డి తెలంగాణ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసాక తోమరి రజిని అనే ఆమె కి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఇక పూర్తి వివరాలను చూసేద్దాం.
ప్రమాణ స్వీకారం చేసిన వేదిక మీదనే రజనీకి ఆ పత్రాలని రేవంత్ ఇచ్చేశారు. హైదరాబాద్ నగరం నాంపల్లి దగ్గర లోని బోయగూడ కి చెందిన రజిని లయోలా స్కూల్ వనిత కాలేజీలో చదివారు. ఓపెన్ యూనివర్సిటీలో ఎంకం పూర్తి చేసారు. అక్టోబర్ 17న కాంగ్రెస్ పార్టీ ప్రచారం సమయంలో గాంధీభవన్లో రేవంత్ రెడ్డిని ఆమె కలిశారు.
Also read:
ఉద్యోగం లేదని ఆమె చెప్పారు. ఆ సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్పకుండా ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం పార్టీ గెలిచిన తర్వాత ప్రమాణస్వీకారోత్సవానికి రజనీని ఆహ్వానించి ఆమెకి ఉద్యోగాన్ని ఇచ్చారు. తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజెన్సీలో ప్రాజెక్టు మేనేజర్ గా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాన్ని ఇచ్చారు. నెలకి రూ. 50 వేల వేతనం అందుతుందని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.