Mumbai : ముంబై-రాంచీ ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి విమానంలోనే రక్తం కక్కుకోవడంతో అత్యవసరంగా విమానాన్ని నాగపూర్ లో ని అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనిన్న రాత్రి దింపారు. 62 ఏళ్ళ డి. తివారీ అనే ఈ వ్యక్తి క్షయ వ్యాధితో బాధపడుతున్నాడని, అతడిని మెడికల్ ఎమర్జెన్సీ కింద నాగపూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని విమాన సిబ్బంది ఒకరు తెలిపారు.
అయితే ఇతడిని ఆసుపత్రికి చేర్చేలోగా మరణించినట్టు నాగపూర్ లోని కిమ్స్ ఆసుపత్రి డాక్టర్ ఐజాజ్ షమీ చెప్పారు. తివారీ మృతికి ముంబై-రాంచీ విమాన సిబ్బంది సంతాపం తెలిపారు. అతడిని రక్షించడానికి ప్రాథమికంగా తాము చేసిన యత్నాలు విఫలమయ్యాయన్నారు.
ఇండిగో పైలట్ ఒకరు ఇదే విమానాశ్రయంలో విమానాన్ని నడిపేందుకు వెళ్ళబోతూ ఎయిర్ పోర్ట్ గేట్ వద్ద కుప్ప కూలిపోయిన ఘటన మరువకముందే ఈ ఘటన జరిగింది.
ఆ పైలట్ ను ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. మనోజ్ సుబ్రమన్యం అనే ఈ పైలట్ నాగపూర్-పూణే విమానాన్ని నడపవలసి ఉంది. అయితే 40 ఏళ్ళ ఆయన గుండెపోటుతో మరణించడం విమాన సిబ్బందిని కలచివేసింది. ఢిల్లీ-దోహా విమానంలో ప్రయాణిస్తున్న ఖతార్ ఎయిర్ వేస్ పైలట్ ఒకరు కూడా గుండెపోటుతో మృతి చెందిన ఉదంతాన్ని విమాన సిబ్బంది గుర్తు చేశారు.