మనిషి రోజు రోజుకు మృగంలా ప్రవర్తిస్తున్నాడని కొన్ని ఘటనలు నిరూపిస్తున్నాయి. వికృత చేష్టలకు పాల్పడుతూ సమాజంలో మాయని మచ్చలా మిగులుతున్నాడు. కోరికలకు బానిసగా మారుతున్న మనిషి ఆలోచన కోల్పోయి.. ఆడవాళ్ళ పట్ల కామంతో ప్రవర్తిస్తున్న తీరు ప్రమాదకరంగా మారుతుంది. చివరికి పసి పిల్లలను కూడా చిదిమేస్తున్న మానవ మృగాలను చట్టం ఎంతలా శిక్షిస్తున్న బుద్ధి రావడం లేదని లోకం దుమ్మెత్తి పోస్తుంది.
వావివరసలు కూడా మరచిపోతున్న మనిషి పశువులా మారుతున్న ఘటనలు కోకొల్లలు.. తాజాగా ఓ మానవ మృగం చిన్నారి పై లైంగిక దాడికి పాల్పడిన ఘటన బోరబండ (Borabanda)లో చోటు చేసుకుంది. కామంతో కళ్ళుమూసుకు పోయిన సాయి అనే యువకుడు.. తాను మనిషినన్న విషయాన్ని మరచి ప్రవర్తించాడు. పసిపాప అని కూడా చూడకుండా.. 8 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
లోక జ్ఞానం కూడా సరిగ్గా తెలియని ఆ పసిదాని నరకయాతన వర్ణనాతీతం.. కాగా విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు ఆగ్రహంతో రగిలిపోయారు. మనిషి రూపంలో ఉన్న ఆ మృగాన్ని అలా వదిలేస్తే తన బిడ్డలాంటి ఎందరి పిల్లల జీవితాన్ని నాశనం చేస్తాడో అని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు (Police) దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న కసాయి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.. మరోవైపు ఇలాంటి కామ పిశాచిల వల్ల ఆడపిల్లలను కనాలంటే భయపడుతున్నారు.. ఇప్పటికే చట్టం (Law) ఎన్ని కఠినమైన శిక్షలు అమలు చేస్తున్న ఇంకా లైంగిక దాడులు (rape) పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదనే ఆందోళన లోకంలో మొదలైంది.


అయితే ఇప్పటి వరకు అధికారం తమదే అనే ధీమాలో బీఆర్ఎస్ (BRS) ఉన్నదన్న విషయం తెలిసిందే. ఎలాగైనా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్న గులాభి బాస్ కు.. తాను చేసిన రాజశ్యామల యాగం ఏమేరకు ప్రభావం చూపిస్తుందో అని అనుకుంటున్నారు. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో (southern states) వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రి (CM) అయిన చరిత్ర ఉందా? అని గమనిస్తే.. అలాంటి చరిత్ర ఇప్పుడు మొదలైతేనే తెలంగాణ రాజకీయం కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతుందని అంటున్నారు.


ఈ విషయాన్ని పదే పదే సోషల్ మీడియా ద్వారా ప్రచారం కూడా చేసింది. అయినా నూటికి ఒక్కడైనా మాట వినని వాడు ఉంటాడు కదా.. ప్రస్తుతం ఇదే జరిగింది. ఓ తిక్కలొడి తిక్క యవ్వారం వార్తల్లో నిలిచింది. నల్గొండ (Nalgonda) జిల్లాలో జరిగిన ఘటన వివరాలు చూస్తే..

