Telugu News » Ayodhya : దేదీప్యమానంగా వెలిగిపోయిన అయోధ్య..!

Ayodhya : దేదీప్యమానంగా వెలిగిపోయిన అయోధ్య..!

సరయు నదీ తీరంలోని 51 ఘాట్లలో 24 లక్షల దీపాలు వెలిగించారు. దీంతో సరయూ నదీ తీరం అత్యంత ప్రకాశవంతంగా మారి పోయింది.

by Ramu

దీపావళి (Deepavali) పండుగ రోజు అయోధ్య (Ayodhya) నగరంలో దీపాల వెలుగులు విరజిమ్మాయి. లక్షల దీపాల వెలుగులో అయోధ్య నగరం దేదీప్యమానంగా వెలిగి పోయింది. సరయు నదీ తీరంలోని 51 ఘాట్లలో 24 లక్షల దీపాలు వెలిగించారు. దీంతో సరయూ నదీ తీరం అత్యంత ప్రకాశవంతంగా మారి పోయింది.

గతంలో ఉజ్జయిని పేరిట ఉన్న 18లక్షల 82వేల దీపాల రికార్డ్‌ను ఈ దీపోత్సవం బ్రేక్‌ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీపావళి సందర్భంగా ఏడవ దీపోత్సవాన్ని సీఎం యోగీ ఆదిత్య నాథ్ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా సీఎం యోగీ మాట్లాడుతూ…. దీపోత్సవం కోసం కార్యక్రమం ప్రారంభమైనప్పుడు, ప్రతి వ్యక్తికి ఒకే ఒక కోరిక ఉందని తెలిపారు. అది రామ మందిరం నిర్మాణం అని ఆయన వెల్లడించారు.

రామ మందిర నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకుని నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని, అయోధ్యలో ప్రభుత్వం ఇప్పటికే కోట్లాది రూపాయల పెట్టుబడులు పెడుతోందన్నారు. గత తొమ్మిదేళ్లలో దేశంలో ప్రధాని మోడీ స్థాపించిన ‘రామరాజ్యం’ పునాదిని అయోధ్య మందిర నిర్మాణం బలపరుస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో 50 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీపోత్సవం అనంతరం ప్రత్యేక లేజర్‌ షో అందర్నీ ఆకట్టుకుంది. దీపోత్సవ కార్యక్రమం నేపథ్యంలో అయోధ్య నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకు ముందు 2018లో నిర్వహించిన దీపోత్సవానికి దక్షిణ కొరియా ప్రథమ మహిళ కిమ్‌ జంగ్‌ సూక్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

You may also like

Leave a Comment