ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 (IPL) సిరీస్ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సీజన్‌లోనూ ముంబై ఇండియన్స్(MUMBAI INDIANS) మళ్లీ గతంలో చేసిన పొరపాట్లను కొనసాగిస్తోంది. ఐపీఎల్ సీజన్‌లో ముంబైకు ఓ ట్రాక్ రికార్డు ఉంది. లీగ్ మ్యాచెస్ ప్రారంభంలో ఓడిపోతూ వస్తూ ఆ తర్వాత విజృంభిస్తుంది.
ఈ సీజన్ -2024లో కూడా ముంబై అదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.అయితే, ఈసారి ముంబైకు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా వ్యహరిస్తున్నారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మను ముంబై యాజమాన్యం అర్ధాంతరంగా తొలగించి అతని స్థానంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను తీసుకొచ్చి నియమించింది.
దీంతో రోహిత్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.ముంబై మ్యాచ్ జరిగినపుడల్లా ‘హిట్ మ్యాన్ బాదాలి.. ముంబై ఓడిపోవాలని’ స్లోగన్స్ ఇస్తున్నారు. ఇకపోతే సోమవారం సాయంత్రం జరిగిన మ్యాచులో ముంబై జట్టు దారుణ పరాజయం పాలైంది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ డకౌట్ అవ్వడం.. ఆ తర్వాత వచ్చిన ప్లేయర్ వచ్చినట్లే పెవిలియన్ బాటపట్టారు.
నిర్ణీత 20 ఓవర్లలో ముంబై కేవలం 125/9 పరుగులు చేయగా.. రాజస్థాన్ రాయల్స్ జట్టు 127/4 కేవలం 15.3 ఓవర్లనే ఛేదించింది.దీంతో ముంబై ఫేవరేట్ వంటకమైన ‘వడాపావ్’ను(VADAPAV) నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఎక్స్(X)లో వడాపావ్ ట్రెండింగ్‌లో ఉంది. హార్దిక్ కెప్టెన్సీ వలన జట్టులో కో ఆర్డినేషన్ దెబ్బతిన్నదని జోరుగా ప్రచారం జరుగుతోంది. రోహిత్, హార్దిక్ అంటూ రెండుగా ముంబై టీం విడిపోయిందని నెట్టింట టాక్ వినిపిస్తోంది.