Telugu News » Balayya Vs Roja : బాలయ్య అలా.. రోజా ఇలా.. పంచ్ లే పంచ్ లు!

Balayya Vs Roja : బాలయ్య అలా.. రోజా ఇలా.. పంచ్ లే పంచ్ లు!

స్పీకర్ టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేసి సభను శుక్రవారానికి వాయిదా వేశారు. అయితే.. సభ నుంచి బయటకొచ్చాక బాలకృష్ణ, రోజా విమర్శల వర్షం కురిపించారు. ప్రభుత్వంపై బాలయ్య పంచ్ డైలాగులు వేయగా.. టీడీపీని టార్గెట్ చేస్తూ రోజా ఫుల్ ఫైరయ్యారు.

by admin
balayya-vs-roja

సినిమాల్లో ఒకప్పుడు బాలకృష్ణ (Balakrishna), రోజా (Roja) అంటే హిట్ పెయిర్. వీళ్లిద్దరూ కలిసి నటించిన సినిమాల్లో దాదాపు అన్నీ హిట్లే. డ్యాన్సులు, ఫ్లైట్లు, డైలాగులు.. ఇలా ఎవరి పంథా వారిది. ప్రస్తుతం వీళ్లిద్దరూ రాజకీయాల్లో ఉన్నారు. రోజా వైసీపీ (YCP) ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతుండగా.. బాలకృష్ణ ప్రతిపక్ష టీడీపీ (TDP) ఎమ్మెల్యేగా ఉన్నారు. సినిమాల్లో పోటాపోటీగా ఎలా నటించారో.. ఇప్పుడు పొలిటికల్ గా పార్టీ భక్తి చూపించడంలో సై అంటే సై అంటున్నారు.

balayya-vs-roja

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ సభ్యులు నిరసనగళం వినిపించారు. తప్పుడు కేసులు పెట్టారని స్పీకర్ పోడియం చుట్టుమిట్టి నినాదాలు చేశారు. స్పీకర్ టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేసి సభను శుక్రవారానికి వాయిదా వేశారు. అయితే.. సభ నుంచి బయటకొచ్చాక బాలకృష్ణ, రోజా విమర్శల వర్షం కురిపించారు. ప్రభుత్వంపై బాలయ్య పంచ్ డైలాగులు వేయగా.. టీడీపీని టార్గెట్ చేస్తూ రోజా ఫుల్ ఫైరయ్యారు.

అసెంబ్లీలో జరిగిన ఘటన ఎంతో బాధాకరమన్న బాలయ్య.. నియంతృత్వ ధోరణిలో శాసనసభ జరగడం మంచి పద్దతి కాదన్నారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని.. ఆధారాలు లేకుండా స్కిల్ డేవలప్మెంట్ కేసు పెట్టారని ఆరోపించారు. ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేసి కక్ష పూరితంగా సీఎం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎక్కడా అభివృద్ధి లేదు.. యువతకు ఉపాధి లేదు అంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబును జైల్లో పెట్టడమే లక్ష్యంగా సీఎం పనిచేస్తున్నారని.. రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందని అన్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని.. అన్నింటా విప్లవం రావాలని చెప్పారు. రాష్ట్రంలో ఎవరికీ భద్రత లేదన్నారు. పార్టీ కార్యకర్తలే కాదు.. జనం కూడా రోడ్లపైకి వచ్చే పరిస్థితి వచ్చిందన్న ఆయన.. అంబటి రాంబాబే మీసం మెలేసి తొడ గొట్టాడని వివరించారు. తాను కూడా తేల్చుకుందాం రా అన్నానని అసెంబ్లీలో జరిగింది వివరించారు బాలకృష్ణ.

ఇక రోజా మాట్లాడుతూ.. శాసనసభలో టీడీపీ వాళ్ళు ప్రవర్తించిన తీరును ఖండిస్తున్నామన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీంలో సమగ్ర విచారణ జరిపే చంద్రబాబును అరెస్ట్ చేశారని చెప్పారు. చంద్రబాబు స్వరూపం ఏంటో అందరికీ తెలిసిపోయిందని.. ఆయన దోపిడీ దొంగ అని ప్రజలకు అర్థమైందని మండిపడ్డారు. సభలో సైకోల్లా టీడీపీ సభ్యులు ప్రవర్తించారని ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆమె.. మీసాలు తిప్పటం, తొడలు కొట్టటం ఎంత వరకు సబబు అంటూ బాలయ్యను టార్గెట్ చేశారు. బావ కళ్ళల్లో ఆనందం కోసం బాలకృష్ణ ప్రయతిస్తున్నారని.. ఎన్టీఆర్ మీద చెప్పులు వేసినప్పుడు మీసం తిప్పారా? అని ప్రశ్నించారు. అంతేకాదు, బాలయ్య డైలాగ్ నే మార్చి.. ‘‘ఫ్లూటు జింక ముందు ఊదు జగన్ ముందు కాదు’’ అంటూ సెటైర్లు వేశారు. ప్రజా సమస్యల కోసం ఏనాడైనా బాలకృష్ణ పోరాడారా? అని ప్రశ్నించిన రోజా.. ప్రజాధనాన్ని దొచ్చుకున్న ఎవరినీ వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీలో రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు.

You may also like

Leave a Comment