Telugu News » Bandi Sanjay : పెద్దపల్లి ఘటనపై ప్రతిపక్షాల సీరియస్.. ఇదేనా బంగారు తెలంగాణ?

Bandi Sanjay : పెద్దపల్లి ఘటనపై ప్రతిపక్షాల సీరియస్.. ఇదేనా బంగారు తెలంగాణ?

ఇది దిశ కంటే దారుణమైన ఘటన అని అన్నారు బండి సంజయ్. స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒకరు, ఓ బీఆర్ఎస్ మంత్రి ఈ కేసును మూసేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

by admin
bandi-sanjay-sensational-comments-on-ts-govt

– మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం
– ప్రభుత్వంపై ప్రతిపక్షాల ఆగ్రహం
– కేసును క్లోజ్ చేసే కుట్ర చేస్తున్నారని అనుమానం
– డైరెక్ట్ గా సీఎంఓ నుంచి ఒత్తిడి!

పెద్దపల్లి (Peddapalli) జిల్లాలో జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. బాధితురాలికి న్యాయం చేయాల్సింది పోయి ప్రభుత్వమే అన్యాయం చేస్తోందని ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనపై బీజేపీ (BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (Bandi Sanjay) స్పందించారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు నయానో భయానో దాన్ని బయటకు రాకుండా చేస్తున్నారని ఆరోపించారు.

bandi-sanjay-sensational-comments-on-ts-govt

అత్యాచారం జరిగిందని పోలీసులు చెబుతారు.. నిందితులను అరెస్ట్ చేస్తారు.. చివరకు సూసైడ్ అంటూ డ్రామా క్రియేట్ చేస్తారిన.. ఇది కేసీఆర్ ప్రభుత్వంలో సర్వసాధారణం అయిపోయిందని విమర్శించారు బండి. అదేమని అడిగితే పిచ్చోడు అంటూ ఎదురుదాడి చేస్తారని మండిపడ్డారు. కేసును నీరు గార్చేశారని పోలీసులపై ఫైరయ్యారు. హత్య, అత్యాచారాలతో బాధితులను ప్రలోభపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలిక మరణాన్ని ఆత్మహత్యగా తేల్చేశారని సీరియస్ అయ్యారు.

ఇది దిశ కంటే దారుణమైన ఘటన అని అన్నారు బండి సంజయ్. స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒకరు, ఓ బీఆర్ఎస్ మంత్రి ఈ కేసును మూసేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ కేసుపై సీఎంఓ నుంచి స్థానిక పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పుట్టగతులుండవని.. మీకు పిల్లలు లేరా? అంటూ మండిపడ్డారు.

బాధిత కుటుంబం చేత స్టేట్ మెంట్ కూడా ఇప్పిస్తారని అన్నారు సంజయ్. ప్రభుత్వం చేసే పని ఇదేనా అని ప్రశ్నించారు. బాలికలపై చేయి వేయాలంటేనే భయపడే ప్రభుత్వం రావాలన్నారు. ఇంత పెద్ద ఘటన జరిగితే దుండగులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని.. ఇంతకంటే సిగ్గుమాలిన ప్రభుత్వం ఉంటుందా? అంటూ ఫైరయ్యారు. ఈ ఘటనను అంత తేలిగ్గా వదిలమని.. మధ్యప్రదేశ్ సీఎంతో చర్చలు జరిపి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామన్నారు బండి సంజయ్.

మధ్యప్రదేశ్‌ కు చెందిన 10 కుటుంబాలు అప్పన్నపేట శివపార్వతి కాలనీలో అపార్ట్​మెంట్ల నిర్మాణ పనులు చేస్తూ అక్కడే గుడారాలు వేసుకొని ఉంటున్నాయి. వీరితోనే ఉంటున్న 15 ఏండ్ల బాలికను ఈనెల 14న నలుగురు యువకులు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం చేశారు. 15వ తేదీ మధ్యాహ్నం అపార్ట్​ మెంట్ల ముందు వదిలిపోయారు. అపస్మారక స్థితిలో, తీవ్ర రక్తస్రావంతో ఉన్న బాలికను ఆమె అక్క, బావ, కాంట్రాక్టర్​.. మధ్యప్రదేశ్​తరలించారు. ఈ క్రమంలో ఆమె చనిపోయింది. ఇంటెలిజెన్స్ వర్గాల ​ద్వారా విషయం తెలుసుకున్న పెద్దపల్లి పోలీసులు మధ్యప్రదేశ్​ పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడి పోలీసులు డెడ్​ బాడీని హ్యాండోవర్​ చేసుకొని ప్రభుత్వ దవాఖానకు తరలించారు.

You may also like

Leave a Comment