కాంగ్రెస్ (Congress) ఎంపీ టికెట్ (Ticket) కోసం పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ మాజీ డైరెక్టర్, డాక్టర్ గడల శ్రీనివాస రావు (Dr. Gadala Srinivasa Rao) దరఖాస్తు చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఖమ్మం, సికింద్రబాద్ ఎంపీ టికెట్ కోసం ఆయన దరఖాస్తు చేసుకోవడంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
టికెట్ కోసం తన సన్నిహితుడు రాము దరఖాస్తు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గా ఉన్న సమయంలోనే ఆయన రాజీకీయపరమైన అంశాలతో వార్తల్లో ఉండేవారు. గతంలో సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కడం అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోసమే కేసీఆర్ ను ప్రసన్నం చేసుకునేందుకే గడల కాళ్లు మొక్కారంటూ అప్పట్లో పెద్ద ఎత్తు ప్రచారం జరిగింది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొత్తగూడెం టికెట్ ను ఆయన ఆశించారు. కానీ టికెట్ దక్కకపోవడంతో ఆయన భంగపడ్డారు.
ఇది ఇలా వుంటే సినీ నిర్మాత బండ్ల గణేశ్ కూడా ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి ఎంపీ టికెట్ కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు సర్వే సత్య నారాయణ ఏకంగా నాలుగు స్థానాల్లో దరఖాస్తు చేశారు. మాజీ మత్రి చంద్ర శేఖఱ్ కుమార్తె నాగర్ కర్నూల్ టికెట్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు.