Telugu News » Bhagwati Charan Vohra : విప్లవకారుల మేధో దిగ్గజం…భగవతి చరణ్ వోహ్రా…!

Bhagwati Charan Vohra : విప్లవకారుల మేధో దిగ్గజం…భగవతి చరణ్ వోహ్రా…!

సహాయ నిరాకరణ ఉద్యమం (Noncooperation movement)లో పాల్గొనేందుకు చదువును మధ్యలో ఆపేసిన గొప్ప దేశ భక్తుడు.

by Ramu
Bhagwati Charan Vohra Intellectual Giant of Indian Revolutionaries

దేశ స్వాతంత్య్రం కోసం ఎంతోమంది మహానుభావులు అలుపెరుగని పోరాటం చేశారు. ఈ క్రమంలో తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారు. అలాంటి వాళ్లలో షహీద్ భగవతి చరణ్ వోహ్రా ((Bhagwati Charan Vohra) ఒకరు. సహాయ నిరాకరణ ఉద్యమం ((Noncooperation movement)లో పాల్గొనేందుకు చదువును మధ్యలో ఆపేసిన గొప్ప దేశ భక్తుడు ఈయన. నవ జవాన్ భారత్ సభ వ్యవస్థాపక సభ్యుడిగా, హెచ్ఆర్ఎస్ఏ ప్రచారకుడిగా విప్లవ ప్రచారం చేస్తూ ఎంతో మందిని విప్లవ బాట పట్టించారు. భగత్ సింగ్ ను బయటకు తీసుకు వచ్చేందుకు బాంబులు తయారు చేస్తూ అమరుడయ్యారు.

Bhagwati Charan Vohra Intellectual Giant of Indian Revolutionaries

1903 నవంబరు 15న ప్రస్తుత పాకిస్థాన్ లోని లాహోర్ ఉన్నత కుటుంబంలో భగవతి చరణ్ వోహ్రా జన్మించారు. తండ్రి శివ చరణ్ వోహ్రా రైల్వే అధికారి. బ్రిటీష్ వాళ్లకు అత్యంత విశ్వాసపాత్రునిగా ఉండటంతో రాయ బహదూర్ అనే బిరుదును ప్రదానం చేశారు. అయితే.. భగవతి చరణ్ వోహ్రా స్థానిక ఎఫ్‌సీ కళాశాలలో 1921లో ఇంటర్‌ చదివారు. 1921లో సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభం కావడంతో తన చదువును మధ్యలోనే వదిలేశారు.

ఉద్యమం పూర్తయిన తర్వాత విద్యను మళ్లీ పూర్తి చేశారు. తర్వాతి కాలంలో భగత్ సింగ్, సుఖ్ దేవ్ లతో వోహ్రాకు పరిచయం ఏర్పడింది. వారితో కలిసి రష్యన్ సోషలిస్టు రెవల్యూషన్ మోడల్ పై స్టడీ సర్కిల్ ఏర్పాటు చేశారు. 1926 భగత్ సింగ్, సుఖ్ దేవ్ లతో కలిసి నవ జవాన్ భారత్ సభ ఏర్పాటు చేశారు. హెచ్ఆర్ఎస్‌ఏ ప్రచారకునిగా పని చేశారు. ఇలా తన ప్రసంగాలు, ప్రచారాల ద్వారా ఎంతోమంది విప్లవం వైపు ఆకర్షితులయ్యేలా చేశారు.

1927లో ఆంగ్లేయ పోలీసు అధికారి శాండర్స్‌ హత్యకు భగత్‌ సింగ్‌, భట్ కేశ్వర్‌ దత్‌ తో కలిసి వోహ్రా ప్లాన్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీలో బాంబులు విసిరిన కేసులో భగత్ సింగ్, సుఖ్ దేవ్ లతో పాటు ఆయనపై కూడా కేసు నమోదైంది. భగత్ సింగ్, సుఖ్ దేవ్ లను జైలు గోడలు బద్దలు కొట్టి బయటకు తీసుకు రావాలని వోహ్రా అనుకున్నారు. ఈ మేరకు దాడికి అవసరమైన బాంబులు తయారు చేయాలని ఆలోచన చేశారు. అనుకున్నట్టుగానే బాంబులు తయారు చేస్తుండగా పేలడంతో 1930 మే 28న మరణించారు. ఆయన చనిపోయే నాటికి వోహ్రా వయసు 26 ఏండ్లు మాత్రమే.

You may also like

Leave a Comment