రాజస్థాన్ (Rajasthan CM)నూతన సీఎంగా భజన్ లాల్ శర్మ (Bajanlal Sharma) ప్రమాణ స్వీకారం చేశారు. జైపూర్ రాజ్ భవన్లో భజన్ లాల్‌తో గవర్నర్ కల్ రాజ్ మిశ్రా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరోవైపు పిపుల్స్ ప్రిన్సెస్ ‘దియా కుమారి’, సీనియర్ బైర్వాలు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు.
ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. మరోవైపు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇటీవల రాజస్థాన్‌లో బీజేపీ ఘన విజయం సాధించింది. 199 స్థానాకుల గాను 115 స్థానాల్లో విజయం సాధించింది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం నూతన సీఎం ఎంపికపై అధిష్టానం కసరత్తులు చేసింది. ఆ సమయంలో వసుంధర రాజే సీఎం అవుతారని చాలా మంది భావించారు. సీఎం సీటు విషయంలో ఆమెతో పాటు బాబా బాలక్‌నాథ్, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ మేఘ్వాల్ పేర్లు కూడా ప్రముఖంగా వినిపించాయి.
ఈ క్రమంలో బీజేపీ శాసన సభా పక్ష సమావేశంలో భజన్ లాల్ శర్మను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో భజన్ లాల్ సంగనేర్ నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. తన ప్రత్యర్థిపై 48,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి పుష్పేంద్ర భరద్వాజ్ కు 97,081 ఓట్లు రాగా, భజన్ లాల్‌కు 1,45,162ఓట్లు వచ్చాయి.