జయశంకర్ భూపాలపల్లి(Jayashankar Bhupalapally) కలెక్టర్(Collector) భవేశ్ మిశ్రా(bhavesh Mishra) తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన అటెండర్(Attendar)తో బూట్లు మోయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
క్రిస్మస్ 2023 సందర్భంగా స్థానిక చర్చిలో జరిగిన వేడుకలకు కలెక్టర్ భవేశ్ మిశ్రా బూట్లతోనే ప్రార్థన మందిరంలోకి వెళ్లారు. బూట్లతో ప్రార్థన మందిరంలోకి వెళ్లడం సరికాదని.. కలెక్టర్ వెంటనే పక్కనే ఉన్న అటెండర్ దఫేదార్ చేతికి తన బూట్లను ఇచ్చారు. అటెండర్ దఫేదార్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా బూట్లను మందిరం నుంచి బయటకు తీసుకెళ్లారు.
ఇందుకు సంబందించిన వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కలెక్టర్ భవేశ్ మిశ్రా తీరు చూసి అందరూ షాక్ అవుతున్నారు. ‘ఇందేం పని కలెక్టర్ గారూ.. మరీ అటెండర్‌తో బూట్లు మోయిస్తారా?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
భవేశ్ మిశ్రాది 2015 ఐఏఎస్ బ్యాచ్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గా గత అక్టోబర్ చివరలో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఉట్నూర్‌లోని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు అధికారిగా పనిచేశారు. భద్రాచలం సబ్ కలెక్టర్‌గా కూడా భవేశ్ మిశ్రా పని చేశారు.