ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో లీగ్ మ్యాచులు రసవత్తరంగా సాగుతున్నాయి. మొత్తానికి ఐపీఎల్ రాకతో పండుగ వాతావరణం నెలకొంది. సాయంత్రం అయ్యిందంటే చాలు ఎక్కడ చూసినా జనాలు మొబైల్స్‌కు అతుక్కుపోతున్నారు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఐపీఎల్ మ్యాచులను వీక్షిస్తున్నారు. ఐపీఎల్ హవా నేపథ్యంలో కంపెనీలు కూడా వ్యాపార ప్రకటనల ద్వారా భారీగానే దండుకుంటున్నట్లు సమాచారం.
ఇక అసలు విషయానికొస్తే నిన్న(ఆదివారం)చెన్నయ్ సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్చాచులో సూపర్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచులో ఇరుజట్లు అద్భతమైన ప్రదర్శన చేశాయి. ఏపీలోని విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ మ్యాచులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఢిల్లీ ప్లేయర్లలో డేవిడ్ వార్నర్ 52(35 బాల్స్), రిషబ్ పంత్ 51 (32), పృథ్వీషా 43(27) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఇక ఢిల్లీ నిర్దేశించిన పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన చెన్నయ్ జట్టు మ్యాచ్ ఆరంభంలోనే కీలక వికెట్లను చేజార్చుకుంది. అజింక్యా రహనే45(30),ధోని 37(16), డ్యారిల్ మిచెల్ 34(26) మినహా మిగతా ప్లేయర్లు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు.
దీంతో 20 ఓవర్లలో చెన్నయ్ 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు మాత్రమే చేసి తొలి ఓటమిని చవిచూసింది.మ్యాచ్ చివర్లో వచ్చిన ధోని బ్యాటింగ్ మెరుపులు చెన్నయ్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్కిచ్చిందని చెప్పుకోవచ్చు. మ్యాచ్ ఓడినా ధోని బ్యాటింగ్‌ను ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారని చెప్పుకోవచ్చు. ఈ సీజన్లో ఢిల్లీకి తొలి విజయం దక్కింది.
కాగా, కెప్టెన్ రిషబ్ పంత్‌కు ఐపీఎల్ యాజమాన్యం షాక్ ఇచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా అతని మ్యాచు ఫీజులో రూ.12 లక్షలు కోత విధించింది. ఈ సీజన్లో గుజరాత్ కెప్టెన్ శుభమన్ గిల్‌కు కూడా స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12లక్షలు మ్యాచ్ ఫీజులో కోత పడిన విషయం తెలిసిందే. శుభమన్ తర్వాత రెండోసారి జరిమానాకు గురైన కెప్టెన్‌గా పంత్ నిలిచాడు.