పతాంజలి ఆయుర్వేద(Patanjali ayurveda sales) ఉత్పత్తుల సేల్స్ పెంచడం కోసం వినియోగ దారులను తప్పు దోవ పట్టించేలా పత్రికా ప్రకటనలు ఇవ్వడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పతాంజలి ఓనర్ రాందేవ్ బాబా, సీఈవో బాలకృష్ణకు సుప్రీంకోర్టు(supream Court) రెండు సార్లు నోటీసులు జారీ చేయగా.. వారి నుంచి ఆలస్యంగా స్పందన రావడంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రకటనలు ఇచ్చినందుకు గాను బేషరతుగా క్షమాపణలు(Sorry) చెప్పాలని రాందేవ్ బాబా, బాలకృష్ణలను కోర్టు ఆదేశించింది. అయితే, ఇటీవల సుప్రీం ఆదేశాల మేరకు రాందేవ్ బాబా బహిరంగ క్షమాపణలు కోరుతూ పత్రికా ప్రకటనను జారీచేశారు.
అది కూడా సుప్రీంకోర్టు మెట్లెకింది. ప్రకటనలు మాత్రం భారీ సైజులో ఇచ్చి క్షమాపణలు మాత్రం చాలా తక్కువ సైజులో ఇవ్వడంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.సాధారణ వీక్షకులకు కనిపించేలా పెద్ద సైజులో క్షమాపణలు కోరుతూ యాడ్ వేయించాలని ఆదేశించడంతో రాందేవ్ బాబా, బాలకృష్ణ మరోసారి క్షమాపణలు కోరుతూ పేపర్ యాడ్స్ ఇచ్చారు.
యాడ్ సైజులోనే క్షమాపణలు కోరుతూ పేపర్లలో ప్రకటన ఇచ్చారు.బేషరతుగా ప్రజలను క్షమాపణలు కోరుతున్నట్లు పతాంజలి సంస్థ యాడ్స్ ఇవ్వడంతో ఈ వివాదం కాస్త ముగింపు దశకు చేరకుంది.కాగా, సేల్స్ పెంచుకోవడానికి తప్పుడు యాడ్స్ ఇవ్వడం మంచిది కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.