82
ఉత్తర భారత్లో ప్రతి పక్ష కాంగ్రెస్ (Congress)కు ఒక్క పార్లమెంటు సీటు కూడా రాదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind)అన్నారు. దేశంలో బీజేపీ మూడవ సారి అధికారాన్ని చేపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
నిజామాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ పది స్థానాల్లో జయ కేతనం ఎగురవేయడం ఖాయమని స్పష్టం చేశారు. రాబోయే లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుతం బీజేపీ తరపున పోటీ చేసేందుకు నాయకులు ఉవ్విళ్లూరుతున్నారని చెప్పారు. ఇప్పటికే నాయకులు చేరికలు కూడా షురువయ్యాయన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీకి 68 శాతం ఓట్లు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు.
తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కేంద్ర పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని వెల్లడించారు. ముఖ్యంగా మహిళలకు 5 లక్షల స్వయం సహాయక సంఘాలకు రూ.కోట్ల రుణాలు మంజూరు చేశారని తెలిపారు. 7 లక్షలపైన ఆయుష్మాన్ భారత్ కార్డులు మంజూరు చేశామని వెల్లడించారు.