Telugu News » BJP : రాజకీయాలకు మాజీ ముఖ్యమంత్రి గుడ్ బై.. మళ్లీ మోడీనే రావాలంటూ స్టేట్మెంట్!

BJP : రాజకీయాలకు మాజీ ముఖ్యమంత్రి గుడ్ బై.. మళ్లీ మోడీనే రావాలంటూ స్టేట్మెంట్!

పార్లమెంట్ ఎన్నికల వేళ అన్ని రాజకీయా పార్టీల్లోనూ(Political parties) అసంతృప్త జ్వాలలు ఎగసిపడుతున్నాయి. కొందరు బాహాటంగానే ప్రకటిస్తుండగా మరికొందరు లోలోపల రగిలిపోతున్నారు. మరికొందరు ధైర్యం చేసి ఇతర పార్టీల్లోకి (migrate) జంప్ చేస్తున్నారు. తమకు నచ్చిన నియోజకవర్గంలో సీటు ఇవ్వలేదని, తమ అనుచరులకు,

by Sai
BJP: Good bye to politics, former Chief Minister.. Statement that Modi should come again!

పార్లమెంట్ ఎన్నికల వేళ అన్ని రాజకీయా పార్టీల్లోనూ(Political parties) అసంతృప్త జ్వాలలు ఎగసిపడుతున్నాయి. కొందరు బాహాటంగానే ప్రకటిస్తుండగా మరికొందరు లోలోపల రగిలిపోతున్నారు. మరికొందరు ధైర్యం చేసి ఇతర పార్టీల్లోకి (migrate) జంప్ చేస్తున్నారు. తమకు నచ్చిన నియోజకవర్గంలో సీటు ఇవ్వలేదని, తమ అనుచరులకు, కుటుంబీకులకు, తాము కోరుకున్నన్నీ సీట్లు ఇవ్వలేదని, ప్రాధాన్యం కల్పించడం లేదని ఇలా అనేక సాకులు చూపిస్తూ కొందరు నేతలు పార్టీలు మారుస్తున్నారు.

BJP: Good bye to politics, former Chief Minister.. Statement that Modi should come again!

ఆ వెంటనే ఇతర పార్టీలో టికెట్ కన్ఫామ్ చేసుకుని పోటీకి సై అంటున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పొలిటికల్ లీడర్స్ చేస్తున్న స్టంట్స్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. మొన్నటివరకు అధికారపార్టీలో కొనసాగిన నేతలంతా వచ్చే ఎన్నికల్లో వేరే పార్టీ గెలుస్తుందని తెలుసుకుని అందులోకి వెళ్లి కండువాలు మారుస్తున్నారు. ఆ వెంటనే మొన్నటివరకు నీడనిచ్చిన పార్టీపై దుమ్మెత్తిపోస్తున్నారు.

తాజాగా బీజేపీ(BJP) కీలక నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, పార్లమెంట్ మెంబర్ సదానంద గౌడ(Karnataka Ex Cm Sadananda gowda) ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. బెంగళూరు నార్త్ సీటు తనకు కేటాయించకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేసిన ఆయన ఏకంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. అయితే, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారని జోరుగా ప్రచారం సాగింది. దీనిపై స్పందించిన మాజీ సీఎం తను ఏ పార్టీలోనూ చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు.

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీనే మళ్లీ ప్రధాని కోరుకుంటున్నట్లు చెప్పారు. కాగా, ఇటీవల ఆర్ఎల్‌జేపీ చీఫ్ పశుపతి పరాస్ కూడా తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఎన్డీయే కూటమిలో మెంబర్‌గా ఉన్న ఆయన ఎంపీ సీట్ల కేటాయింపులో తన పార్టీకి బీజేపీ ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంతో ఆయన అలకబూని ఏకంగా తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు.

పూర్తికథనం..

 

You may also like

Leave a Comment