రాజస్థాన్ ( Rajasthan)లో అధికార కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. రాష్ట్రంలో బీజేపీ (BJP) మెజారిటీ దిశగా దూసుకు వెళ్తోంది. ప్రస్తుతం ఆ పార్టీ 115 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు 100 సీట్లు అవసరం ఉంటుంది. తాజాగా బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను దాటింది. దీంతో బీజేపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.
అటు కాంగ్రెస్ 69 స్థానాల్లో లీడ్‌లో ఉంది. బీజేపీ విజయంపై కేంద్ర మంత్రి గజేంద్ర షకావత్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మ్యాజిక్ ముగిసిందన్నారు. రాజస్థాన్‌లో మహిళల గౌరవానికి ప్రజలు ఓటు వేశారని అన్నారు. పేదల సంక్షేమానికి ప్రజలు మద్దతు తెలిపారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
రాజస్థాన్‌లో బీజేపీ విజయం సాధిస్తుందని తాను మొదటి రోజు నుంచి చెబుతున్నానని అన్నారు. ప్రధాని మోడీ చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు బీజేపీకి పట్టం కడుతున్నారని తెలిపారు. చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ లలో కూడా బీజేపీ సర్కార్ ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే బీజేపీ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నాయి.
మరోవైపు టోంక్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ లీడింగ్ లో ఉన్నారు. మరోవైపు జల్రాపతాన్ నుంచి మాజీ సీఎం వసుంధర రాజే సిందియా, సర్దార్ పురా నుంచి సీఎం అశోక్ గెహ్లాట్ లీడింగ్ లో ఉన్నారు. గోవింద్ సింగ్ (కాంగ్రెస్), రాజేంద్ర సింగ్ (బీజేపీ), సీపీ జోషి(బీజేపీ) వెనుకంజలో ఉన్నారు.