రాజస్థాన్ (Rajasthan) లో తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల మొదటి విడత జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. మొదటి విడత జాబితాలో మొత్తం 33 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ (Congress) విడుదల చేసింది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ( Ashok Gehlot) సర్దార్ పురా నియోజక వర్గం నుంచి పోటీకి దిగుతున్నారు.
మరోవైపు సచిన్ పైలట్ టాంక్ నియోజక వర్గం నుంచి బరిలో దిగుతున్నారు. రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి నత్ ద్వారా నియోజక వర్గం నుంచి పోటీలో ఉంటున్నారు. ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్ర లక్ష్మణ్ ఘర్, పంజాబ్ కాంగ్రెస్ మాజీ ఇంఛార్జ్ హరీశ్ చౌదరి బెయిటూ నుంచి, దివ్య మెడర్నా ఓషియన్ నుంచి పార్టీ బరిలో దింపింది.
మరోవైపు బీజేపీ తమ పార్టీ తరఫున పోటీ చేసే రెండో విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. రెండో విడత జాబితాలో మొత్తం 83 మంంది పేర్లను కాషాయ పార్టీ ప్రకటించింది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత వసుంధర రాజే సింధియా జాలార్ పథాన్ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారని బీజేపీ పేర్కొంది.
ఇక రాజేంద్ర ప్రసాద్ (తారా నగర్), రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షులు సుతీశ్ పూనియా (అంబర్), కాళీ చరణ్ సరఫ్ (మాలవీయా నగర్), వాసుదేవ్ దేవ్ నానీ (అజ్మీర్ ఉత్తర), నర్పత్ సింగ్ రజ్వీ (చిత్తోర్ ఘర్), అనితా బాదేల్ (అజ్మీర్ దక్షిణ) నుంచి పోటీలో ఉంటారని పేర్కొంది.