సనాతన ధర్మం(Sanatana Dharma) పై తన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోడీ (PM MOdi), బీజేపీ నేతలు వక్రీకరించారని తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) అన్నారు. మారణ హోమం సృష్టించాలని తాను అన్నట్టు బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేశారని తెలిపారు. ఆ సమావేశంలో కేవలం తాను మూడు నిమిషాలు మాత్రమే మాట్లాడాడనన్నారు.
ఎలాంటి వివక్ష లేకుండా అందర్ని సమానంగా చూడాలని మాత్రమే తాను పిలుపునిచ్చానన్నారు. వివక్షతను రూపు మాపాలని తాను కోరానన్నారు. కానీ ఆ వ్యాఖ్యలను వక్రీకరించి ఇప్పుడు దేశం మొత్తం తన గురించి మాట్లాడుకునేలా చేశారని వెల్లడించారు. కరూర్ జిల్లాలో నిర్వహించిన ఓ సమావేశంలో ఉదయ్ నిధి స్టాలిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..
ఓ స్వామీజీ తన తలకు రూ. 5 నుంచి 10 కోట్లు వెలకట్టారని అన్నారు. ప్రస్తుతం కేసుపై న్యాయస్థానంలో విచారణ జరుగుతోందన్నారు. తనకు న్యాయస్థానాలపై నమ్మకం ఉందని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని కోరారన్నారు. కానీ తాను క్షమాపణ చెప్పలేదన్నారు. తాను స్టాలిన్ కొడుకునని, కలైంగర్ మనువడినన్నారు. తాను వారి భావజాలాన్ని మాత్రమే సమర్థిస్తున్నానన్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. సనాతన ధర్మం అనేది సమానత్వం, సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. అందువల్ల సనాతన ధర్మాన్ని పూర్తిగా నిర్మూలించాలన్నారు. దీనిపై బీజేపీ శ్రేణులు, హిందూ సంఘాలు మండిపడ్డాయి. ఆ తర్వాత మద్రాసు కోర్టు కూడా ఉదయనిధిని మందలించింది.