దేశ వ్యాప్తంగా పలు సంస్థలను బీజేపీ (BJP) కాషాయీకరణ (Saffronise) చేస్తోందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamatha Benarjee) అన్నారు. ఇప్పుడు టీమ్ ఇండియా జట్టును కూడా ఆ పార్టీ కాషాయికరించిందన్నారు. టీమ్ ఇండియా ఆటగాళ్లు ఇప్పుడు ఆరెంజ్ కలర్ జెర్సీ ధరించి ప్రాక్టీస్ సెషన్స్ పాల్గొంటున్నారని ఆమె తెలిపారు.
సెంట్రల్ కోల్‌కతాలోని పోస్తా బజార్లో జగత్ ధాత్రి పూజలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. టీమిండియా సభ్యుల ప్రాక్టీస్ సెషన్ సమయంలో వేసుకునే డ్రెస్‌ను బీజేపీ కాషాయికరించిందన్నారు. అంతేకాదు ఇప్పుడు మెట్రో స్టేషన్లకు కూడా కాషాయ రంగులు వేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.
మోడీ సర్కార్ ఇప్పుడు అన్ని సంస్థలకు కాషాయ రంగు వేసే పనిలో ఉందని మండిపడ్డారు. టీమి ఇండియా ఆటగాళ్లను చూసి తాను గర్వపడుతున్నానని చెప్పారు. ప్రపంచకప్‌లో భారత్ విజయం సాధిస్తుందని తాను బలంగా నమ్ముతున్నానన్నారు. బీజేపీ నేతలు విగ్రహాలను ప్రతిష్టించడంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.
కానీ వాళ్లు దేశం మొత్తం కాషాయ రంగులోకి మార్చాలని అనుకుంటున్నారంటూ ఫైర్ అయ్యారు. యూపీలో మాయావతి స్వయంగా ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నారని అన్నానరు. అలాంటి విషయాలు తాను గతంలో ఎప్పుడూ వినలేదన్నారను. ఇలాంటి నాటకాలు ప్రతి సారి లబ్ది చేకూర్చవన్నారు. అధికారం ఈ రోజు ఉంటుంది రేపు పోతుందన్నారు.