Telugu News » CBN Arrest : జనసేన నేతలకు నారా బ్రాహ్మణి ఏం చెప్పారంటే..?

CBN Arrest : జనసేన నేతలకు నారా బ్రాహ్మణి ఏం చెప్పారంటే..?

తెలుగుదేశం, జనసేన పార్టీల నుంచి సమన్వయ కమిటీ ఏర్పాటుపై లోకేశ్ చర్చిస్తున్నారని బ్రాహ్మణి అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు రెండు పార్టీలు అన్నదమ్ముల్లా కలిసి పోరాడాలన్నారు.

by Prasanna

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు (Chandra Babu) అరెస్ట్, ఆ తదనంతర పరిణామల నేపథ్యంలో నారా బ్రాహ్మణిని (Brahmini) తూర్పుగోదావరి జిల్లా జనసేన (Janasena) నాయకులు కలిసారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, చేయాల్సిన కార్యాచరణ తదితర విషయాలు చర్చించారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎవరూ, ఎప్పుడూ చూడలేదని బ్రాహ్మణి తెలిపారు. చంద్రబాబు కేసు విషయంలో అన్ని డాక్యుమెంట్లు, రిపోర్టులు  పరిశీలించానని తెలిపారు. చంద్రబాబు తప్పు చేసినట్లు ఏ చిన్న ఆధారం కూడా లేదన్నారు. ఈ కేసు కేవలం రాజకీయ కక్షతో పెట్టిందేనని అన్నారు.

Brahmini Janasena

తెలుగుదేశం, జనసేన పార్టీల నుంచి సమన్వయ కమిటీ ఏర్పాటుపై లోకేశ్ చర్చిస్తున్నారని బ్రాహ్మణి అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు రెండు పార్టీలు అన్నదమ్ముల్లా కలిసి పోరాడాలన్నారు. స్వయంగా వచ్చి సంఘీభావం తెలిపిన జనసేన నేతలకు, అండగా నిలబడుతున్న పార్టీ కార్యకర్తలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

తాను చిన్నప్పటినుంచీ రాజకీయ కుటుంబంలోనే పెరిగాననీ కానీ ఈ స్థాయి విద్వేష రాజకీయాలు ఎప్పుడూ చూడలేదని బ్రాహ్మణి అన్నారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేవని… గంజాయి, డ్రగ్స్ మాత్రమే ఉన్నాయన్నారు. కనీసం ప్రజాస్వామ్యం రాష్ట్రంలో కనిపించడంలేదన్నారు. ఈ ప్రభుత్వ అవినీతిని అందంరం కలిసి సమష్టింగా ఎదుర్కొవాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

చంద్రబాబు అరెస్ట్ ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపు చర్యే అని బ్రాహ్మణిని కలిసిన జనసేన నేతలు అన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయన్నారు. రాక్షస పాలనపై ఉమ్మడి పోరాటం చేయాలన్నారు. చంద్రబాబు అరెస్ట్‌‌ను నిరసిస్తూ ఉమ్మడిగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.

 

 

You may also like

Leave a Comment