కేంద్ర హోం మంత్రి అమిత్‌షా(Amith shah) ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అమిత్ షా సోదరి రాజేశ్వరి బెన్(Rajeshwari ben) సోమవారం ముంబై(Mumbai)లోని ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. కొన్ని నెలల కిందట ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆమెకు వైద్యులు శస్త్ర చికిత్స చేశారు.
అనంతరం ఆమె కోలుకునే దశలో ఆరోగ్యం క్షీణించి మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే గుజరాత్‌తో వర్చువల్‌గా జరగాల్సిన రెండు సమావేశాలను అమిత్ షా రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని బీజేపీ శ్రేణులు వెల్లడించాయి.
అంతకుముందు గుజరాత్లో రెండు కార్యక్రమాల్లో షా పాల్గొనాల్సి ఉంది. బనస్కాంత జిల్లాలోని దేవదర్లోని బనాస్ డెయిరీ ప్రారంభం, గాంధీనగర్‌లోని రాష్ట్రీయ రక్ష విశ్వవిద్యాలయం కార్యక్రమాల్లో అమిత్‌షా షెడ్యూల్ ఉంది.
బనస్కాంత కార్యక్రమానికి హాజరైన గుజరాత్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అజయ్ పటేల్ మాట్లాడుతూ.. అమిత్ షా సోదరి మృతిచెందడంతో ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారని ప్రకటించారు.