Telugu News » KCR : కాంగ్రెస్ పాలన బాగుంటే టీడీపీ పుట్టేదా?

KCR : కాంగ్రెస్ పాలన బాగుంటే టీడీపీ పుట్టేదా?

దివంగత సీఎం ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చి రూ.2 కిలోల బియ్యం ఇచ్చారని.. అప్పుడు కాంగ్రెస్ పాలన బాగుంటే అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు పుట్టేదని అన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్ర‌జలు, హ‌క్కుల‌ కోసమని తెలిపారు.

by admin
brs-public-meeting-in-manakondur

– కాంగ్రెస్ తో ఎన్నో ఏళ్లు గోస పడ్డాం
– మళ్లీ ఆ దరిద్ర పాలన వద్దు
– హస్తానికి అవకాశమిస్తే 3 గంటలే కరెంట్
– ఆలోచించి ఓటెయ్యండి
– ప్రజలకు కేసీఆర్ సూచన

కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) తో ఉపయోగం లేదన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR). ఎన్నికల ప్రచారంలో భాగంగా మానకొండూరు, స్టేషన్ ఘన్ పూర్, నకిరేకల్ లో జరిగిన సభల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ చేసిన తప్పిదాలతో ఎన్నో ఏళ్లు అరిగోసపడ్డామన్నారు. తెలంగాణ (Telangana) ఇవ్వకుండా ఆలస్యం చేసి ఎందర్నో బలిగొన్న పార్టీని మళ్లీ నమ్మి మోసపోవద్దని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ పాలన బాగుంటే ఉమ్మడి రాష్ట్రంలో వలసలు ఎందుకు ఉండేవని ప్రశ్నించారు.

brs-public-meeting-in-manakondur

కాంగ్రెస్ పాలనలో నిత్యం రైతుల ఆత్మహత్యలు జరిగేవని గుర్తు చేశారు కేసీఆర్. ఆ పార్టీ నాయకులు మళ్లీ అలాంటి ఇందిరమ్మ పాలను తీసుకువస్తామంటున్నారని ఫైర్ అయ్యారు. ఒకనాడు బలవంతంగా తెలంగాణను తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపి ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. పొరపాటున తెలంగాణలో ఆపార్టీ గెలిస్తే 3 గంటల కరెంటే వస్తుందన్నారు. ఓటు వేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలని సూచించారు.

దివంగత సీఎం ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చి రూ.2 కిలోల బియ్యం ఇచ్చారని.. అప్పుడు కాంగ్రెస్ పాలన బాగుంటే అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు పుట్టేదని అన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్ర‌జలు, హ‌క్కుల‌ కోసమని తెలిపారు. కాంగ్రెస్ రాజ్యంలో ప‌త్తికాయలు ప‌గిలిన‌ట్టు రైతుల గుండెలు ప‌గిలి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయినా రావాల్సినంత ప్రజాస్వామ్య పరిణతి రాలేదని చెప్పారు. ప్రజాస్వామ్య పరిణతి వచ్చినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు.

ఇక, ఆటో డ్రైవర్లకు కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్యాసింజర్ ఆటోలకు ఫిట్ నెస్ ఫీజు రూ.700, పర్మిట్ రూ.500 మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇకపై ఆటో కార్మికులకు ఆ బాధే ఉండదన్నారు. తాను కరీంనగర్ కు వచ్చిన ప్రతిసారీ ఒక కొత్త స్కీమ్ ప్రకటిస్తామని తెలిపారు. అలాగే, ట్రాఫిక్‌ పోలీసులు పొద్దాక పొగలో ఉంటారు కాబట్టి శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారని.. భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక్క తెలంగాణలోనే 30శాతం అలవెన్స్‌ వారి వేతనంలో ఇస్తున్నామని వివరించారు. భారతదేశంలో హోంగార్డులకు అత్యధిక వేతనం ఇచ్చే రాష్ట్రం మనదేనన్నారు కేసీఆర్.

You may also like

Leave a Comment