పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేంద్రంలోని బీజేపీ(BJP) ఆదివారం ‘సంకల్ప్ పత్ర’ (Sankalp patra)పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది. అయితే, దీనిపై తాజాగా ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే(AICC Cheif Kharge) స్పందించారు. మోడీ మేనిఫెస్టోను నమ్మలేమని కామెంట్ చేశారు. అందుకు గల కారణాలను ఆయన వివరించే ప్రయత్నం చేశారు.
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రస్తుతం మేనిఫెస్టోలో మోడీ హామి ఇచ్చారు. అలాగే పంటలకు ఎంఎస్పీని పెంచుతానని, చట్టపరమైన హామీని ఇస్తానని చెప్పారు. కానీ గత పదేళ్లలో మోడీ దేశంలోని ప్రజలందరికీ ప్రయోజనం కలిగే విధంగా ఏ ఒక్క పని చేయలేదని విమర్శించారు.
తమ డిమాండ్లు నేరవేర్చాలని రైతులు కేంద్రానికి వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీలో నిరసనలు చేసినా పట్టించుకోలేదన్నారు. అందుకే మేము మోడీ మేనిఫెస్టోను నమ్మలేమంటూ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ విడుదల చేసిన సంకల్ప పత్రలో ప్రజలకు ఉపయోగ పడేది ఏది లేదన్నారు.
దేశంలో నిరుద్యోగం పెరుగుతున్నా మోడీ యువతకు భోరోసా ఇస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఓవైపు ద్రవ్యోల్భణం విపతీరంగా పెరుగుతోందని, దానిని నియంత్రించేందుకు కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకుందో చెప్పాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశప్రజలు బీజేపీ మేనిఫెస్టోను, ఆ పార్టీని నమ్మేలా లేరని స్పష్టంచేశారు.