Telugu News » CEC : హైదరాబాద్ మినీ భారత్.. ఎన్నికలపై సీఈసీ కీలక ప్రకటన..!

CEC : హైదరాబాద్ మినీ భారత్.. ఎన్నికలపై సీఈసీ కీలక ప్రకటన..!

2022-23లో తెలంగాణలో 22 లక్షల ఓట్లను తొలగించామని చెప్పిన రాజీవ్ కుమార్.. 35 వేల 356 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఫామ్ అందిన తర్వాతే ఓటర్ల జాబితాలో పేర్లు తొలగించామని చెప్పారు.

by admin
CEC Rajeev Kumar Press Meet On Telangana Elections 2023

తెలంగాణ (Telangana) లో ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల కమిషన్ (Election Commission) ప్రకటించిన నేపథ్యంలో గురువారం మీడియాతో మాట్లాడారు సీఈసీ రాజీవ్ కుమార్ (CEC Rajeev Kumar). ఈ సందర్భంగా కీలక విషయాలు వెల్లడించారు. తెలంగాణలో ఓటర్ల సంఖ్య 3.17 కోట్లుగా ఉందని.. కొత్తగా 8.11 లక్షల యువత నమోదు చేసుకున్నారని వెల్లడించారు. యవ ఓటర్లు ఎక్కువగా ఉన్నారని చెప్పిన ఆయన.. 80 ఏళ్లు నిండిన వారికి వర్క్ ఫ్రమ్ ఓట్ వేసే అవకాశం కల్పిస్తున్నామని ప్రకటించారు. వందేళ్లు దాటిన ఓటర్ల సంఖ్య 7,600గా ఉందని.. పారదర్శకంగా ఈ జాబితా రూపొందించామని పేర్కొన్నారు.

CEC Rajeev Kumar Press Meet On Telangana Elections 2023

2022-23లో తెలంగాణలో 22 లక్షల ఓట్లను తొలగించామని చెప్పిన రాజీవ్ కుమార్.. 35 వేల 356 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఫామ్ అందిన తర్వాతే ఓటర్ల జాబితాలో పేర్లు తొలగించామని చెప్పారు. ప్రతీ ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అన్ని రాజకీయ పార్టీలతో తాము ముందుగా సమావేశమయినట్లు తెలిపారు. అభ్యర్థుల ప్రచార వ్యయం పరిమితి పెంచాలని పార్టీలు కోరినట్లు వివరించారు. హైదరాబాద్ మినీ భారత్ లాంటిదని అన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంస్థలతోనూ తాము సమావేశమైనట్లు తెలిపారు.

హైదరాబాద్‌ లో మూడు రోజుల పాటు సీఈసీ బృందం పర్యటించింది. మూడు రోజులుగా నగరంలోనే ఉన్నారు సీఈసీ, ఇద్దరు కమిషనర్లు. అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను ఈ బృందం పరిశీలించింది. ఈ క్రమంలోనే గురువారం తెలంగాణ సీఎస్‌, డీజీపీని సీఈసీ బృందం కలిసింది. రాష్ట్రంలో పరిస్థితులు, ఎన్నికల నిర్వహణపై చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో శాంతిభద్రతలపై సీఈసీ బృందం ఆరా తీసింది.

రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల కమిషన్ బుధవారం విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,17,17,389 మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ ​వెల్లడించింది. ఇందులో పురుషులు 1,58,71,493 కాగా.. మహిళా ఓటర్లు 1,58,43,339 మంది ఉన్నారు. ట్రాన్స్ ​జెండర్ ​ఓటర్లు 2,557 మంది ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో రిలీజ్​ చేసిన జాబితాతో పోలిస్తే 5.8 శాతం ఓటర్ల సంఖ్య పెరిగినట్లు ఈసీ తెలిపింది. కొత్తగా 17.01 లక్షల మంది ఓటు హక్కును పొందారు.

You may also like

Leave a Comment