Telugu News » Chandra Babu: సంకెళ్లు నా సంకల్పాన్ని బంధించ లేవు… ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ….!

Chandra Babu: సంకెళ్లు నా సంకల్పాన్ని బంధించ లేవు… ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ….!

తాను 45 ఏండ్లుగా కాపాడుకుంటూ వ‌స్తున్న విలువ‌లను, విశ్వ‌స‌నీయ‌త‌ను ఎవరూ చెరిపి వేయలేరని పేర్కొన్నారు.

by Ramu
CBN

తెలుగు ప్రజలకు టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) బహిరంగ లేఖ (Open Letter) రాశారు. తాను జైల్లో లేనని, ప్రజల హృదయాల్లో ఉన్నానని లేఖలో పేర్కొన్నారు. ప్ర‌జ‌ల నుంచి తనను ఒక్క క్షణం కూడా ఎవరూ దూరం చేయలేరని అన్నారు. తాను 45 ఏండ్లుగా కాపాడుకుంటూ వ‌స్తున్న విలువ‌లను, విశ్వ‌స‌నీయ‌త‌ను ఎవరూ చెరిపి వేయలేరని పేర్కొన్నారు.

కాస్త ఆల‌స్య‌ం జరిగినా న్యాయమే గెలుస్తుందని చెప్పారు. తాను త్వ‌ర‌లో విడుదలై బ‌య‌ట‌కు వస్తానన్నారు. ప్ర‌జ‌ల కోసం, రాష్ట్ర ప్ర‌గ‌తి కోసం రెట్టించిన ఉత్సాహంతో ప‌నిచేస్తానని స్పష్టం చేశారు. ఈ జైలు గోడల మధ్య కూర్చుని ఆలోచిస్తూ వుంటే తన 45 ఏండ్ల ప్రజా జీవితం మొత్తం కండ్ల ఎదుట కదలాడుతోందని వెల్లడించారు. తెలుగు ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా తన రాజకీయ ప్రస్థానం సాగిందన్నారు.

ఈ మొత్తానికి అటు దేవుడు ఇటు ప్రజలే ప్రత్యక్ష సాక్షులని అన్నారు. కొంత మంది ఓటమి భయంతో తనను జైలు గోడల మధ్య బంధించి ప్రజలకు దూరం చేశామని అనుకుంటున్నారని చెప్పారు. కానీ ప్రజల నుంచి తనను ఎవరూ దూరం చేయలేరని చెప్పారు. తాను ప్రజల మధ్య తిరుగుతూ ఉండకపోవచ్చు. కానీ, అభివృద్ధి రూపంలో ప్రతి చోటా కనిపిస్తూనే ఉంటానన్నారు.

ఈ ఏడాది దసరాకు పూర్తి స్థాయి మేనిఫెస్టోను విడుదల చేస్తానని రాజమహేంద్రవరం మహానాడులో చెప్పానన్నారు. ఇప్పుడు అదే రాజమహేంద్రవరం జైలులో తనను ఖైదు చేశారన్నారు. త్వరలో విడుదలై వచ్చి పూర్తి స్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఎప్పుడూ బయటకు రాని తన భార్య భువనేశ్వరి బయటకు వచ్చారని అన్నారు. తాను అందుబాటులో లేని ఈ కష్ట సమయంలో ప్రజల్లోకి వెళ్లి వారి తరఫున పోరాడాలని ఆమెను కోరానన్నారు. స్తోంది.

కుట్రలు చేసి తనపై అవినీతి ముద్ర వేసేందుకు ప్రయత్నించారని వెల్లడించారు. కానీ, తాను నమ్మిన విలువలు, విశ్వసనీయతను ఎన్నడూ చెరిపేయలేరన్నారు. ఈ చీకట్లన్నీ కేవలం తాత్కాలికమేనన్నారు. సత్యం అనే సూర్యుడి ముందు కారు మబ్బులు వీడిపోతాయన్నారు. సంకెళ్లు తన సంకల్పాన్ని బంధించలేవన్నారు. జైలు గోడలు తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవన్నారు.

జనమే తన బలమన్నారు. జనమే తన ధైర్యమన్నారు. తన క్షేమం కోసం కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు చేసిన ప్రార్థనలు ఫలిస్తాయన్నారు. కొన్ని సార్లు న్యాయం జరగడం ఆలస్యం కావచ్చన్నారు. కానీ అంతిమంగా న్యాయమే గెలుస్తుందన్నారు. ప్రజల అభిమానం, ఆశీస్సులతో త్వరలోనే తాను బయటకు వస్తానన్నారు. అంత వరకు నియంత పాలనపై శాంతియుత పోరాటం చేయాలని కోరారు. తాత్కాలికంగా మంచి ఓడినట్టు కనిపించినా కాలపరీక్షలో గెలిచి తీరుతుందన్నారు. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

You may also like

Leave a Comment