టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి (Chandra Babu Naidu)తో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో ఇరు పార్టీల అధినేతలు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. సుమారు రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాల గురించి ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు.
చంద్రబాబు అరోగ్యం గురించి ఈ సందర్బంగా ఆయన అడిగి తెలుసుకున్నారు. మధ్యంతర బెయిల్ గురించి ఈ సందర్బంగా చంద్రబాబుతో పవన్ చర్చించారు. ఇక తెలంగాణ, ఏపీలో ప్రస్తుత రాజకీయాల గురించి ప్రత్యేకంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఎన్నికల క్షేత్ర స్థాయిలో టీడీపీ-జనసేన చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ సందర్బంగా చర్చించారు.
10 అంశాలతో మినీ ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించాలని ఇరు పార్టీలు యోచిస్తున్నాయి. త్వరలోనే ఇరు పార్టీల మధ్య ఉమ్మడి స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కామన్ మినిమమ్ ప్రోగ్రాం రూపకల్పన విషయం గురించి ఇరువురు చర్చించినట్టు సమాచారం.
మరోవైపు ఉమ్మడి స్థాయి సమావేశంలో చంద్రబాబు పాల్గొన వచ్చా అనే అంశంపై న్యాయ నిపుణులతో టీడీపీ చర్చిస్తోంది. ఆయన ఆరోగ్యం కుదుట పడ్డ తర్వాతే ఈ సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో కరువు, ధరల పెరుగుదల, విద్యుత్ ఛార్జీలు మద్యం, ఇసుక కుంభకోణాల వంటి అంశాల్లో క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల నేతలు పోరాటాలు చేయాలని నిర్ణయించారు.