Telugu News » Quash Petition : రేపు సుప్రీంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ

Quash Petition : రేపు సుప్రీంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ

దీంతో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాదబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంలో రేపు ప్రస్తావనకు రానుంది. ఏపీ హైకోర్టు చంద్రబాబు క్వాషన్‌ను కొట్టివేయడంతో టీడీపీ అధినేత లాయర్లు సుప్రీం కోర్టుకు వెళ్లారు.

by Prasanna
quash petition

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సుప్రీం కోర్టు (Supreme Court) లో దాఖలు చేసిన పిటిషన్‌ను ఆయన తరఫు న్యాయవాది సిద్దార్థ లూథ్రా సీజే ధర్మాసనం ముందు ప్రస్తావించారు. అయితే రేపు మెన్షన్ లిస్ట్ ద్వారా రావాలని చంద్రబాబు న్యాయవాదులకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ (Justice DY ChandraChud) తెలిపారు.

quash petition

దీంతో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాదబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంలో రేపు ప్రస్తావనకు రానుంది. ఏపీ హైకోర్టు చంద్రబాబు క్వాషన్‌ను కొట్టివేయడంతో టీడీపీ అధినేత లాయర్లు సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం అని.. అక్కడ ప్రతిపక్షాలు అణచివేయబడుతున్నాయని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్దార్థ లూథ్రా సీజే ధర్మాసనం ముందు ప్రస్తావించారు. అయితే రేపు మెన్షన్ లిస్ట్ ద్వారా రావాలని చంద్రబాబు న్యాయవాదులకు జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. అప్పుడు దానిని చూస్తామని చెప్పారు. ఈరోజు మెన్షన్ జాబితాలో పిటిషన్ లేనందున…విచారణ జరిపేందుకు నిరాకరించారు.

ఏపీ ప్రభుత్వం తరపున హైకోర్టులో వాదించిన ముకుల్ రోహత్గీ, సిఐడి తరపున వాదించిన రంజిత్ కుమార్‌లు కూడా సుప్రీంకోర్టుకు హాజరయ్యారు.

ఇదిలా ఉంటే, దీనికి ముందు పరిణామాలకు ఒక సారి చూస్తే…స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్ వేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో ఏసీబీ కోర్టు ఇచ్చిన తన రిమాండ్‌ను క్వాష్ చేయాలని పిటిషన్‌లో చంద్రబాబు కోరారు. మరోవైపు ఈ కేసులో చంద్రబాబు రిమాండ్‌ను విజయవాడలోని ఏసీబీ కోర్టు అక్టోబర్ 5 వరకు పొడిగించింది. ఇక, చంద్రబాబును రెండు రోజుల పాటు సీఐడీ అధికారులు కస్టడీ విచారణ చేసిన సంగతి తెలిసిందే.

 

You may also like

Leave a Comment