Telugu News » Chandrababu : సుప్రీంను ఆశ్రయించిన చంద్రబాబు

Chandrababu : సుప్రీంను ఆశ్రయించిన చంద్రబాబు

స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు రాష్ట్ర హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా దాన్ని హైకోర్ట్ డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే.

by Prasanna

టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ (Quash Pitition) దాఖలు చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో (Supreme Court) పిటిషన్ వేశారు. చంద్రబాబు (Chandrababu) అరెస్ట్ అక్రమమని, కుట్ర పూరితంగా అరెస్ట్ చేశారని ఈ క్రమంలో కేసును కొట్టివేయాలని ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్ లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో పిటిషన్ కాపీని చంద్రబాబు తరపు లాయర్లు అందజేశారు. ఈ పిటిషన్ సోమవారం సుప్రీం కోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది.

quash

స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు రాష్ట్ర హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా దాన్ని హైకోర్టు డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు. స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేశారు. శుక్రవారం హైకోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పునిస్తు దర్యాప్తు దశలో జోక్యం చేసుకోలేమని చెప్పింది. సెక్షన్ 482 కింద దాఖలైన వ్యాజ్యంలో మినీ ట్రయల్ నిర్వహించలేమని పేర్కొంది.

హైకోర్టలో క్వాష్ పిటిషన్ కొట్టివేశాక చంద్రబాబుతో చర్చించిన చంద్రబాబు లీగల్ టీం చంద్రబాబుతో ములాఖత్ అయి సీఐడీ కస్టడీ, క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన అంశాలను చంద్రబాబుకు వివరించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై బాబుతో చర్చించారు. దానికి చంద్రబాబు అంగీకరించటంతో ఆయన తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో ఇవాళ పిటిషన్ దాఖలు చేశారు.

కాగా.. ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న నారా లోకేష్.. సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టులో తీర్పు వచ్చేంతవరకు ఢిల్లీలోనే లోకేష్ ఉంటారని తెలుస్తోంది. సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట వస్తుందని ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

 

You may also like

Leave a Comment