Telugu News » Chandrababu Remand  : చంద్రబాబుకు కస్టడీ ముగిసింది, రిమాండ్ పొడిగించారు

Chandrababu Remand  : చంద్రబాబుకు కస్టడీ ముగిసింది, రిమాండ్ పొడిగించారు

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచే జైలు అధికారులు చంద్రబాబును వర్చువల్‌గా న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చారు. రిమాండ్‌ పొడిగించాలన్న సీఐడీ అధికారుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

by Prasanna

చంద్రబాబుకు ఏసీబీ కోర్టు (ACB Court) విధించిన రెండు రోజుల కస్టడీ ఇవాళ్టితో ముగిసింది. మరో వైపు స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ (Skill Development Corporation) కేసులో చంద్రబాబుకు జ్యూడిషీయల్ రిమాండ్‌ (Judicial Remand) పొడిగించింది ఏసీబీ కోర్టు. అక్టోబర్ 5 వరకు రిమాండ్ విధించింది. మరో 11 రోజుల పాటు రిమాండ్ పొడిగించారు. రెండ్రోజుల సీఐడీ కస్టడీ ముగిసిన నేపథ్యంలో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచే జైలు అధికారులు చంద్రబాబును వర్చువల్‌గా న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చారు. రిమాండ్‌ పొడిగించాలన్న సీఐడీ అధికారుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

chandrababu
సీఐడీ కస్టడీలో ఉన్న చంద్రబాబును తొలి రోజు దాదాపు 50 ప్రశ్నలు అడగగా, రెండో రోజు సైతం అదే స్థాయిలో సీఐడీ అధికారులు చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. మొత్తం 30 అంశాలపై 120 వరకు ప్రశ్నలు సంధించి చంద్రబాబు నుంచి సీఐడీ కొన్ని వివరాలు రాబట్టారు. డాక్యుమెంట్స్ చూపించి నిధులు ఎలా కేటాయించారని సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని అధికారులు ప్రశ్నించారు.  షెల్ కంపెనీల ద్వారా నిధుల తరలింపుపై సీఐడీ తమ అనుమానాలను విచారణలో ప్రస్తావించింది. మొత్తంగా రెండు రోజుల్లో 12 గంటలపాటు  సీఐడీ అధికారులు స్కిల్ డెవలప్ మెంట్ పై చంద్రబాబును ప్రశ్నించారు.

విచారణ ముగిసిన తర్వాత వర్చువల్ గా జడ్జి చంద్రబాబును ప్రశ్నించారు. మిమ్మల్ని అధికారులు, పోలీసులు ఏమైనా వేధించారా, థర్డ్ డిగ్రీ ప్రయోగించారా అనే ప్రశ్నలు వేశారు. దానికి చంద్రబాబు లేదని, తాను అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని తెలిపారు. ఇదే సమయంలో మీరు పోలీసు కస్టడీలో లేరు, జ్యూడిషియల్ రిమాండ్ లోనే ఉన్నారని జడ్జి చంద్రబాబుతో చెప్పారు.

చంద్రబాబుకు మళ్లీ రిమాండ్ పొడిగించడంతో…మరికొన్ని రోజులు రిమాండ్ ఖైదీగానే చంద్రబాబు రాజమండ్రి జైలులోనే ఉండాల్సి ఉంది. ఈ నేపధ్యంలో రేపు సుప్రీంకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ విచారణకు రానుంది. చంద్రబాబు బెయిల్ పిటిషన్ కూడా రేపు విచారణకు రానుంది.

You may also like

Leave a Comment