Telugu News » Skill Development Case : చంద్రబాబు భవిష్యత్తు తేల్చే కీలక తీర్పులు ఇవాళే !

Skill Development Case : చంద్రబాబు భవిష్యత్తు తేల్చే కీలక తీర్పులు ఇవాళే !

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడిని కస్టడీ కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు తీర్పు వాయిదా వేసిన విషయం తెలిసిందే.

by Prasanna
chandrababu

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు (Skill Development Case) లో ఇవాళ అటు ఏపీ హైకోర్టు (High Court), ఇటు ఏసీబీ కోర్టు (ACB Court) లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై తీర్పు మరోసారి వాయిదా పడింది. ఇవాళ చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించనుంది.

chandrababu

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడిని కస్టడీ కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు తీర్పు వాయిదా వేసిన విషయం తెలిసిందే. నిన్న రావల్సిన తీర్పు..ఇవాళ్టికి వాయిదా పడింది. ఎందుకంటే ఇదే కేసును కొట్టి వేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వాదనలు కూడా పూర్తయ్యాయి.

చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై బుధవారమే వాదనలు ముగిశాయి. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో మరిన్ని విషయాలను వెలికి తీసేందుకు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ తరపు న్యాయవాది కోరగా సిట్ కార్యాలయంలో ఇప్పటికే విచారణ జరిపారని, రాజకీయ కక్ష పూరిత కేసు కాబట్టి కస్టడీ అవసరం లేదని చంద్రబాబు తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు. శుక్రవారం తీర్పు చెబుతామని న్యాయమూర్తి తెలిపారు. చంద్రబాబు క్వాష్ తీర్పు హైకోర్టులో ఉన్న దృష్ట్యా కస్టడీ పిటిషన్ పై తీర్పును న్యాయమూర్తి వాయిదా వేశారు.

హైకోర్టులో ఇవాళ క్వాష్ పిటిషన్ లిస్ట్ అయితే తీర్పు వాయిదా వేస్తానని చెప్పారు. క్వాష్ పిటిషన్ లిస్ట్ కాకపోతే తీర్పును వెలువరించనున్నట్లు వెల్లడించారు. అయితే ఇవాళ హైకోర్టులో క్వాష్ పిటిషన్ లిస్ట్ కాలేదు కాబట్టి కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది.

You may also like

Leave a Comment