అంతరిక్షరంగంలో భారత్ మరో మైలు రాయిని అధిగమించింది.అతి తక్కువ ఖర్చుతో చంద్రుని దక్షిణ ధృవంపై ల్యాండర్ (Lander)ను దించిన తొలిదేశంగా చరిత్ర సృష్టించింది.
ఇంత వరకూ ఏ దేశం చంద్రుని దక్షిణ ధృవంపై అడుగు పెట్టలేదు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO)కృషి ఫలితంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో మిగిలిన దేశాలకంటే భారత్ ఏమాత్రం తీసిపోదని మరో సారి రుజువైంది.
చంద్రయాన్-3లోని ల్యాండర్ మాడ్యూల్( విక్రమ్ ల్యాండర్,ప్రగ్యాన్ రోవర్(Pragyan Rover)తో కలిగి ఉంటుంది)ను చంద్రుడి దక్షిణ ధృవంపై సేఫ్ గా ల్యాండ్ అయింది. దీంతో అమెరికా, చైనా, రష్యా తర్వాత చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన నాల్గవ దేశంగా స్థానం సంపాదించింది.
చంద్రయాన్ -3 విజయంపై రాష్ట్రపతి, ప్రధాన మంత్రి,సినీ నటులు సహా పలువురు ప్రముఖులు ట్వీట్స్ చేసి తమ అభినందనలు తెలిపారు.పలువురు దేశ,విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా మన దేశ శాస్త్రవేత్తల కృషిని అభినందిస్తూ ట్వీట్ చేస్తున్నారు.
తాజాగా పాకిస్థాన్ నటి సెహర్ షిన్వారీ(Sehar Shinwari)చంద్రయాన్ -3 సక్సెస్ పై ఇస్రో శాస్త్రవేత్తను అభినందిస్తూ భారత్‌కు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా సొంత దేశం పాకిస్థాన్ పై తనదైన స్థాయిలో తీవ్ర విమర్శలు చేసింది.
భారత దేశంతో శత్రుత్వాన్ని పక్కనపెడితే ఇస్రోను అభినందించాల్సిందే. భారత శాస్త్రవేత్తలకు భారత ప్రభుత్వ సహాయ సహకారాలతో ఇది సాధ్యమైందన్నారు. భారత్ స్థాయిని అందుకోవడం పాకిస్థాన్‌ను ఇప్పట్లో సాధ్యం కాదు.
భారత్ ఎంత ఎత్తుకు ఎదిగిందో చూసి పాకిస్థాన్ సిగ్గుతో తలదించుకోవాల్సిందే.ఈ దురదృష్ట పరిస్థితికి పాకిస్థాన్(Pakistanస్వయంకృతాపరాధమే కారణమని పేర్కొంది. ఏది ఏమైనా భారత్ సాధిస్తున్న ప్రగతిపై ఈ నటి చేసిన ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Apart from animosity with India, I would really congratulate ISRO for making history in the space research through Chandaryan3. The gap between Pakistan and India has widened to such a level in all aspects that now it will take two to three decades for Pakistan to reach there.…
— Sehar Shinwari (@SeharShinwari) August 23, 2023